Beetroot Juice: ఉదయం పూట బీట్‌రూట్ జ్యూస్‌కి మించినది లేదు..! ఎందుకో తెలుసుకోండి..

Beetroot Juice: బీట్‌ రూట్‌ జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. డైలీ ఒక గ్లాస్‌ ఈ జ్యూస్‌ తీసుకుంటే డాక్టర్‌ వద్దకు వెళ్లే పనే ఉండదు.. శరీరానికి

Beetroot Juice: ఉదయం పూట బీట్‌రూట్ జ్యూస్‌కి మించినది లేదు..! ఎందుకో తెలుసుకోండి..
Beetroot Juice

Updated on: Oct 22, 2021 | 9:55 PM

Beetroot Juice: బీట్‌ రూట్‌ జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. డైలీ ఒక గ్లాస్‌ ఈ జ్యూస్‌ తీసుకుంటే డాక్టర్‌ వద్దకు వెళ్లే పనే ఉండదు.. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని అందుతాయి. తాగిన తర్వాత షుగర్ లెవల్స్ హెల్త్ పై ఎంత ప్రభావం కనిపిస్తుందో అనే అనుమానం ఉండనే ఉంటుంది. కానీ ఇది అలాంటిది కాదు. కార్డియోవాస్క్యూలర్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ పై పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

1. బీట్‌ రూట్‌ జ్యూస్‌ వల్ల రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల రక్తం త్వరగా తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇక రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా ఎంతో శక్తి అందుతుంది.

2. బీట్‌రూట్‌లో శరీరానికి కావాల్సిన చాలా విటమిన్స్‌ ఉంటాయి. బీ,సీ విటమిన్స్‌ అందుతాయి. బీట్ రూట్‌లో కాల్షియంతో పాటు మెగ్నిషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. కాలేయం శుభ్రం కావడానికి బీట్‌రూట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. రుచూ బీట్ రూట్ తింటూ ఉంటే గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెప్పారు. రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.

4. బీట్ రూట్ గర్భిణీలకు చాలా మంచిది. ప్రెగ్నెంట్స్ కు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ మొత్తం కూడా బీట్ రూట్ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది.

Maa Elections 2021: మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విష్ణు తొలి నిర్ణయం.. మహిళల భద్రత కోసం..

Suhas’s Family Drama: సుహాస్ హీరోగా క్రైం థ్రిల్లర్ “ఫ్యామిలీ డ్రామా”.. ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సినిమా.. ఎప్పుడంటే

Sajjala Ramakrishna Reddy: చేసేది దీక్ష.. మాట్లాడేదీ బూతులు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్..