Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు అలెర్ట్.. ఆ సమయంలో ఈ టాబ్లెట్స్ అస్సలు వేసుకోవద్దు.! పుట్టబోయే పిల్లల్లో..

|

Mar 31, 2022 | 1:52 PM

సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మధుమేహం అనేది ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధితో బాధపడేవారు రక్తంలో..

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు అలెర్ట్.. ఆ సమయంలో ఈ టాబ్లెట్స్ అస్సలు వేసుకోవద్దు.! పుట్టబోయే పిల్లల్లో..
Diabetics
Follow us on

సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మధుమేహం అనేది ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధితో బాధపడేవారు రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. మందులతో మాత్రమే కాదు.. ఆహారపు అలవాట్లలోనూ మార్పులు ఉంటేనే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇదిలా ఉంటే.. డయాబెటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండోది టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్‌లో, ప్యాంక్రియాస్(క్లోమ గ్రంధి) తగినంతగా ఇన్సులిన్‌ను ఉత్పత్తిని చేయదు. ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి చేయబడదు, అయితే టైప్ 2 డయాబెటిస్‌లో శరీరం ఇన్సులిన్‌ను నిరోధించడాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇందువల్ల రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.

టైప్ 2 డయాబెటిస్‌కు నియంత్రణకు చాలా మందలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అందులో ఒకటి మెట్‌ఫార్మిన్(MetFormin). ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోనివారికి మెట్‌ఫార్మిన్ టాబ్లెట్స్‌ను సజెస్ట్ చేస్తారు. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో ఈ మందు చాలా ప్రభావితం చూపిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను మెట్‌ఫార్మిన్ తగ్గించడమే కాకుండా.. మధుమేహ సమస్యను అదుపులో ఉంచుతుంది. అయితే మెట్‌ఫార్మిన్‌ను వాడటం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్(Annals Of Internal Medicine) జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం మెట్‌ఫార్మిన్ ప్రతికూలతల గురించి పలు కీలక విషయాలు బయటపడ్డాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులైన పురుషులు మెట్‌ఫార్మిన్ ఎక్కువగా తీసుకుంటే.. వారికి పుట్టబోయే మగ పిల్లల్లో జననేంద్రియ లోపాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి మూడు నెలల ముందు నుంచే మెట్‌ఫార్మిన్ టాబ్లెట్స్‌ వాడకం ఆపేయాలని .. అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే.. వారికి పుట్టబోయే మగ పిల్లల పుట్టుకలో జననేంద్రియ లోపాలు ఉంటాయని అధ్యయనం హెచ్చరించింది.

మెట్‌ఫార్మిన్‌ పురుషులలో జనన పునరుత్పత్తిపై ప్రభావితం చూపించడమే కాకుండా.. వారికి పుట్టబోయే మగ పిల్లల పుట్టుకపైనా ప్రభావం చూపిస్తుందని ఫలితాలు సూచిస్తున్నాయి. 1997-2016 మధ్య జన్మించిన పిల్లల డేటాను ఆధారంగా తీసుకుని ఈ పరిశోధన జరిపారు. అధ్యయనం ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ ఉండి.. మెట్‌ఫార్మిన్ మందును తీసుకోని పురుషులకు జన్మించిన పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు 3.1 శాతం ఉంటే.. మెట్‌ఫార్మిన్ తీసుకున్న పురుషులకు జన్మించిన పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు 4.6 శాతంగా తేలింది.