Navaratri 8th Day Naivedyam: రేపు మహిషాసురమర్దని అవతారంలో అమ్మవారు.. నైవేద్యంగా స్వీట్ పొంగల్ .. తయారీ

|

Oct 13, 2021 | 2:26 PM

Navaratri 8th Day Naivedyam: దేవి నవరాత్రుల్లో రేపు ఎనిమిదో రోజు.. అమ్మవారు మహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవడానికి అమ్మవారు..

Navaratri 8th Day Naivedyam: రేపు మహిషాసురమర్దని అవతారంలో అమ్మవారు.. నైవేద్యంగా స్వీట్ పొంగల్ .. తయారీ
Navaratri 8th Naivedyam
Follow us on

Navaratri 8th Day Naivedyam: దేవి నవరాత్రుల్లో రేపు ఎనిమిదో రోజు.. అమ్మవారు మహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవడానికి అమ్మవారు మహిషారుడిని సంహరించారు. దీంతో అమ్మవారు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖ శాంతులతో ఉండేలా కాపాడుతుందని భక్తుల నమ్మకం. అందుకనే ఈరోజు అమ్మను మహిషాశుర మర్దని రూపంలో సేవించడంవల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మరికి నైవేద్యంగా బెల్లం అన్నం లేదా పరమాన్నం నివేదన చేస్తారు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

బియ్యం: ఒక కప్పు
సగ్గుబియ్యం-పావు కప్పు
బెల్లం- తీపికి సరిపడా
యాలకుల పొడి
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు
కిస్మిస్
బాదంపప్పు పలుకులు

తయారు చేసే విధానం: ముందుగా సగ్గుబియ్యం ఒక గిన్నెలో పోసి నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత స్టౌ మీద దళసరి గిన్నె పెట్టి.. అందులో పాలు పోసి.. ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి.. కొంచెం ఉడికిన తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యం వేసుకుని.. బియ్యం, సగ్గుబియ్యం ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత తరిగిన బెల్లం వేసుకుని కొంచెం సేపు ఉడికించాలి. ఇంతలో వేరే స్టౌ మీద చిన్న గిన్నె పెట్టి… నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు, కిస్ మిస్, బాదాం పలుకులు దొరవేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బెల్లం అన్నంలో కలిపి.. తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అంతే అమ్మవారికి ఇష్టమైన ఘుమఘుమలాడే తియ్యటి పాయసం రెడీ.. నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులుకండి

Also Read: అసలైన దసరా వేడుకలు జరిగేది అక్కడే.. ఈ రాష్ట్రాలలో జరిగే దసరా వేడుకలను చూస్తే అస్సలు మర్చిపోలేరు..