
వర్షాలు పడుతున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి, కరకరలాడే మిరపకాయ బజ్జి తినాలనే కోరిక కలగడం సహజం.. ఈ ఆకలిని తీర్చడానికి, ఇంట్లోనే 100% రుచికరమైన, ఆరోగ్యకరమైన మిరపకాయ బజ్జిని సింపుల్ గా ఎలా తయారుచేయాలో ఈ కథనంలో తెలుసుకోండి.. వంటరాని వారు లేదా మొదటగా చేసే వారు కూడా కొన్ని టిప్స్ తో అద్భుతమైన విధంగా రుచికరమైన మిరపకాయ బజ్జీలను తయారు చేసుకోవచ్చు.. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు..
హైదరాబాదీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో రుచికరమైన మిరపకాయ బజ్జి తయారీ విధానం తెలుసుకుందాం..
ముందుగా, పావు కేజీ బజ్జి మిరపకాయలను శుభ్రంగా కడగాలి. బజ్జి మిరపకాయలు సాధారణంగా లావుగా, కారం తక్కువగా ఉంటాయి.
ప్రతి మిరపకాయకు నిలువుగా మధ్యలోకి ఘాటు పెట్టి, లోపల ఉండే గింజలను జాగ్రత్తగా తీసేయాలి. ఇది కారం తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో 1 టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలుపాలి. ఉప్పు కరిగిన తర్వాత, ఘాటు పెట్టిన మిరపకాయలను ఈ ఉప్పు నీళ్లలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. ఇది మిరపకాయలకు మరింత రుచిని ఇస్తుంది.
ఒక పాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి.
ఉప్పు నీళ్లలో నానబెట్టిన మిరపకాయలను తీసి, ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకున్న బ్యాటర్‌లో పూర్తిగా ముంచాలి.
మిరపకాయను పిండిలో ముంచిన తర్వాత, ఒక వైపు గిన్నె అంచుకు రాసుకుంటూ అదనపు పిండిని తీసేసి, జాగ్రత్తగా వేడెక్కిన నూనెలో వేయాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న మిర్చి కూడా బాగా కాలుతుంది.
ఒక నిమిషం పాటు ఒక వైపు వేగిన తర్వాత, రెండో వైపుకు తిప్పుకోవాలి.
అన్ని వైపులా తిప్పుతూ, బజ్జి బంగారు గోధుమ రంగులోకి వచ్చి క్రిస్పీగా మారేవరకు వేయించుకోవాలి.
వేయించిన బజ్జిలను నూనె పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి.
ఇంకెందుకు ఆలస్యం.. వేడివేడి, కరకరలాడే మిర్చి బజ్జిని మీకు ఇష్టమైన సాస్ లేదా పుదీనా చట్నీతో కలిపి ఆస్వాదించండి. ఈ రుచికరమైన బజ్జి వర్షాకాలంలో లేదా చల్లటి వాతావరణంలో అద్భుతమైన స్నాక్‌గా ఉంటుంది.
ఇలానే.. పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు.. ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో.. మిగిలిన పిండితో అద్భతంగా తయారు చేసుకోవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..