మెరిసే చర్మం, సిల్కీ జుట్టు కోసం ఇది బెస్ట్‌ స్నాక్!

08 July  2026

Jyothi Gadda

జీడిపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. 

ఇందులో మెగ్నీషియం ఖనిజం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తనాళాలను ప్రశాంతంగా ఉంచి, రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య అదుపులోకి వస్తుంది.

చాలా మంది జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ, ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ మరియు పీచుపదార్థం, జీవక్రియలను వేగవంతం చేస్తాయి. బరువు తగ్గడంలోనూ మంచిది.

ఎముకల బలానికి కేవలం కాల్షియం మాత్రమే కాదు, మెగ్నీషియం, రాగి కూడా అంతే అవసరం. జీడిపప్పులో ఈ రెండు పోషకాలు భారీగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి సమస్యలు రాకుండా కాపాడతాయి.

మెదడు కణాలు సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి జీడిపప్పులోని హెల్తీ ఫ్యాట్స్ తోడ్పడతాయి. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మూడ్‌ని మెరుగుపరుస్తాయి.

జీడిపప్పులో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్, మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి.

జీడిపప్పులో కాపర్ చర్మానికి, జుట్టుకు రంగునిచ్చే మెలనిన్ అనే పిగ్మెంట్ ఉత్పత్తికి అవసరం. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా నిరోధించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. జుట్టు సిల్కీగా మారుతుంది.

జీడిపప్పులో ఉండే జింక్, విటమిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు మరియు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని లోపలి నుండి బలంగా ఉంచుతాయి.