శ్రావణ మాసం వచ్చేస్తుంది.. మీ తులసి గుబురుగా పెరగాలంటే జస్ట్ ఇలా చేయండంతే!
08 July 2026
Anand T
ఆయుర్వేదంలో, భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
తులసి ప్రాముఖ్యత
వాతావరణ పరిస్థితుల కారణంగా చాలామందికి తులసి మొక్క ఎండిపోవడం, ఆకులు రాలడం, గుబురుగా పెరగకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వర్షాకాలంలో తులసి గుబురుగా పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం.
పెంపంకం
ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఆవాలు, పసుపు మిశ్రమం ఎండిపోతున్న తులసి మొక్కకు కూడా ప్రాణం పోస్తుంది.
సహజమైన ఎరువు
కాబట్టి ఆవాలను మిక్సీ పట్టి, ఆ పొడిని ఒక రోజంతా ఎండబెట్టండి. తేమ పోయిన ఈ పొడిని డబ్బాలో నిల్వ చేసుకోండి.
ఆవాల పొడి తయారీ
అర చెంచా ఆవాల పొడికి, అర చెంచా పసుపు పొడిని కలిపితే తులసి మొక్కకు కావాల్సిన ఒక చెంచా ఎరువు సిద్ధమవుతుంది.
మిశ్రమం తయారీ
10 అంగుళాల కుండీలోని పెద్ద మొక్కకు ఒక చెంచా, అదే చిన్న మొక్కలకైతే అర చెంచా ఎరువు మాత్రమే వేయాలి.
తగిన మోతాదు
ఎరువును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మొక్క మొదలు చుట్టూ చల్లి, వెంటనే నీరు పోయాలి. మధ్యాహ్నం పూట అస్సలు వేయకూడదు.
వేసే సమయం
ఈ సహజ ఎరువును నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. మోతాదుకు మించి ఎక్కువసార్లు ఇస్తే మొక్కకు హాని కలగవచ్చు.
నెలకు ఒకసారి
ఆవాలలోని నైట్రోజన్ మొక్కను పచ్చగా, గుబురుగా చేస్తుంది. అలాగే పసుపులోని యాంటీఫంగల్ గుణాలు చీడపీడల నుండి రక్షిస్తాయి. తద్వారా మీ ఇంట్లోని తులసి కొద్దిరోజుల్లోనే గుబురుగా పెరుగుతుంది.