ఉరుకులు పరుగుల జీవితం.. బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలా ముఖ్యం.. అయితే.. మనం సాధారణంగా రాత్రి వేళ నిద్రపోయే సమయంలో కొన్ని తప్పులను చేస్తుంటాం.. అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రపోయే ముందు ఏది తిన్నా అది మన నిద్రతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా, కొన్ని ఆహారాలు.. పానీయాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీయడంతోపాటు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.. దీని వల్ల నిద్రపోవడం కష్టం అవుతుంది. నిద్రకు భంగం ఏర్పడుతుంది. దీనివల్ల మరుసటి రోజు ఇది మీ పనిపై భారం పడుతుంది.. నీరసం, అలసటతోపాటు.. మరికొన్ని సమస్యలను ఎదుర్కొవాల్సి రావొచ్చు.. ఇంకా ఇదే తరహాలో కొనసాగితే.. మీకు నిద్రలేమి సమస్య కూడా రావొచ్చు..
సాధారణంగా, రాత్రిపూట కాఫీ తాగకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ అధిక మొత్తంలో నిద్రను నిరోధిస్తుంది. ఇది కాకుండా, హెవీ లేదా స్పైసీ ఫుడ్స్ కడుపు సమస్యలను పెంచుతాయి. దీని కారణంగా నిద్ర చక్రం చెదిరిపోతుంది. దీనివల్ల అర్థరాత్రి వరకు మెలకువగా ఉండాల్సి రావచ్చు.
రాత్రి పడుకునే ముందు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో.. డైటీషియన్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకోండి..
స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ అసిడిటీ, మలబద్ధకం, మంట వంటి కడుపు సంబంధిత సమస్యలను పెంచుతాయి.. ఇది నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది. ఇటువంటి ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇది శరీరంలోని సహజ నిద్ర చక్రానికి భంగం కలిగించడానికి కారణం అవుతుంది.
చాక్లెట్: ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లో కెఫిన్, థియోబ్రోమిన్ ఎక్కువగా ఉంటాయి. ఇది నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మనం నిద్రపోవడానికి ఇబ్బంది పడవచ్చు. అధిక మోతాదులో చక్కెర కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
సిట్రస్ ఫ్రూట్స్: నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి ఆమ్ల ఆహారాలు రాత్రిపూట తింటే యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. ఇది మీ నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. నిద్రను తగ్గిస్తుంది.
సోడా – శీతల పానీయాలు: శీతల పానీయాలు, ముఖ్యంగా సోడా, అధిక మొత్తంలో కెఫీన్‌ను కలిగి ఉంటాయి.. ఇవి మన శరీరానికి హానికరం.. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల నిద్ర భంగం ఏర్పడవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..