Child Diet Plan: మీ చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం.. ఎలాంటి ఆహారాన్ని డైట్‌లో చేర్చాలో తెలుసా..?

|

Jun 07, 2021 | 3:03 PM

Childrens Health Diet: అసలే కరోనా కాలం.. పిల్లల ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బలమైన ఆహారం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి

Child Diet Plan: మీ చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం.. ఎలాంటి ఆహారాన్ని డైట్‌లో చేర్చాలో తెలుసా..?
Childrens Diet Plan
Follow us on

Childrens Health Diet: అసలే కరోనా కాలం.. పిల్లల ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బలమైన ఆహారం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి మెరుగుపడటంతోపాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరు చురుకుగా మారుతుంది. మన శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే మనం తినే ఆహార పోషకాలు మెదడుకు చేరుతాయి. కావున పిల్లలకు మరింత పోషకమైన ఆహారం ఇవ్వాలి. పిల్లల ఆహారంలో ఎలాంటి పదార్థాలను చేర్చాలో ఒకసారి తెలుసుకోండి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. ఆరోగ్యవంతంగా మారుతారని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

గుడ్లు..
పిల్లలకు అల్పాహారంలో గుడ్లు ఇవ్వాలి. గుడ్లలో కేలరీలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫోలేట్, కాల్షియం, ఫాస్ఫరస్, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

చేపలు..
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఫిష్ లో ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయి. సాల్మన్, మాకెరెల్, ట్యూనా, ట్రౌట్, సార్డిన్స్, హెర్రింగ్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వారానికి ఒకసారి పిల్లల ఆహారంలో చేపలను చేర్చాలని సూచిస్తున్నారు.

ఓట్స్..
పిల్లల ఆహారంలో ఓట్స్ ను చేర్చడం మంచిది. ఓట్స్ మెదడుకు మంచి శక్తి వనరు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్స్‌లో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, జింక్ కూడా ఉంటాయి. ఇవి పిల్లల మెదడును చురుగ్గా చేస్తాయి. వీటితోపాటు ఆహారంలో యాపిల్స్, అరటిపండ్లు, బ్లూబెర్రీలు, బాదం పప్పును కూడా చేరిస్తే బలమైన పోషకాలు లభిస్తాయి.

డార్క్ చాక్లెట్
పిల్లలు చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు. ఇలాంటి సందర్భంలో మీరు ఇతర చాక్లెట్ల కాకుండా డార్క్ చాక్లెట్ ఇస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. కానీ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

అవకాడో
అవొకాడోలను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైటోకెమికల్స్, ఫైబర్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు అవకాడోలో పొటాషియం కూడా ఉంటుంది. వీటిని పిల్లల ఆహారంలో చేర్చడం ఉత్తమం.

ఆకుకూరలు
ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఆకుకూరలను పిల్లల ఆహారంలో చేర్చాలి. వీటితోపాటు టమాటాలు, చిలగడ దుంపలు, గుమ్మడి, క్యారెట్లు చేరిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

పాలు, పెరుగు, జున్ను..
పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్, బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు న్యూరోట్రాన్స్మిటర్లు, ఎంజైమ్ ల అభివృద్ధికి దొహదపడతాయి. దీంతోపాటు ఈ పదార్థాల్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున పిల్లల్లో దంతాలు, ఎముకలు బలంగా పటిష్టంగా తయారవుతాయి.

Also Read:

Brain Boosting Food For Kids: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ ఆహారం తినిపించాలి.. నిపుణుల సూచనలు..

Turmeric Basil Tea : కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఒక్కసారి ఈ టీ తాగి చూడండి..?