AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చియా సీడ్స్ Vs సబ్జా సీడ్స్.. వీటిని ఇలా తిన్నారో ప్రాణాలకే రిస్క్.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి మనం కూల్ డ్రింక్స్ వైపు వెళ్తాం. కానీ మన ఇంట్లోనే ఉండే చియా, సబ్జా గింజలు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. అయితే వీటిని నానబెట్టకుండా తింటే గొంతులో చిక్కుకుంటాయని మీకు తెలుసా? కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని ఎందుకు ముట్టుకోకూడదు? చియా , సబ్జా గింజల మధ్య ఉన్న తేడా ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చియా సీడ్స్ Vs సబ్జా సీడ్స్.. వీటిని ఇలా తిన్నారో ప్రాణాలకే రిస్క్.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Chia Vs Sabja Seeds Benefits
Krishna S
|

Updated on: Mar 22, 2026 | 9:45 PM

Share

ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని లోపలి నుండి చల్లబరుచుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన గింజలు చియా, సబ్జా. చూడటానికి ఒకేలా ఉన్నా, వీటి పోషకాలు, ఉపయోగించే విధానంలో కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. హెల్త్‌లైన్ నివేదికల ప్రకారం.. ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు, వీటిని తినేటప్పుడు మనం చేసే పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాల గని: చియా – సబ్జా

ఈ రెండు గింజలు పరిమాణంలో చిన్నవైనా, ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం చాలా పెద్దది. వీటిలో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. సబ్జా గింజల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

తినే సరైన విధానం ఏంటి?

ఈ గింజలను ఎలా పడితే అలా కాకుండా, శాస్త్రీయంగా తీసుకుంటేనే పూర్తి ఫలితం ఉంటుంది..

నానబెట్టడం తప్పనిసరి: చియా, సబ్జా గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టడం ఉత్తమం. నానిన తర్వాత ఇవి జెల్ లాగా మారుతాయి.

డిటాక్స్ డ్రింక్: ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో నానబెట్టిన గింజలు, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరం నుండి విష పదార్థాలు బయటకు పోతాయి.

ఇతర మార్గాలు: వీటిని పెరుగు, స్మూతీలు, పుడ్డింగ్‌లు లేదా కొబ్బరి నీటిలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు.

ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

చాలా మంది ఈ గింజలను తీసుకునేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

నేరుగా తినకూడదు: ఎండు గింజలను ఎప్పుడూ నేరుగా మింగకూడదు. ఇవి గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది.

అతిగా వద్దు: రోజుకు 2 టీస్పూన్ల కంటే ఎక్కువ నానబెట్టిన గింజలను తీసుకోకపోవడమే మంచిది. అతిగా తింటే జీర్ణ సమస్యలు రావచ్చు.

నీరు తక్కువగా తాగడం: ఈ గింజలలో ఫైబర్ ఎక్కువ కాబట్టి, వీటిని తిన్నప్పుడు రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి.

వీరు జాగ్రత్తగా ఉండాలి

కిడ్నీ సమస్యలు ఉన్నవారు: స్టేజ్ 3 కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులు చియా గింజలను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఎలక్ట్రోలైట్లను చాలా పరిమితంగా తీసుకోవాలి.

అలెర్జీ బాధితులు: మీకు నువ్వులు లేదా వేరుశెనగలతో అలెర్జీ ఉంటే, చియా గింజల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటిలోని ప్రొటీన్ వల్ల కొంతమందికి అలెర్జీ వచ్చే అవకాశం ఉంది.

మందులు వాడుతున్న వారు: ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించిన తర్వాతే వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.

చియా – సబ్జా గింజలు వేసవిలో మన ఆరోగ్యానికి రక్షణ కవచాలు. సరైన పద్ధతిలో, సరైన మోతాదులో తీసుకుంటే ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి.

Follow Us
ఈ రెండు తప్పులు చేస్తున్నారా..? మీ పీఎఫ్ వడ్డీ ఆగిపోయే ప్రమాదం
ఈ రెండు తప్పులు చేస్తున్నారా..? మీ పీఎఫ్ వడ్డీ ఆగిపోయే ప్రమాదం
అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి!
అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి!
'IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఒంటరి వాడిని చేశావ్'
'IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఒంటరి వాడిని చేశావ్'
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!