Biryani Masala Recipe
భారతీయులు ఆహార ప్రియులు. రకరకాల ఆహార పదార్ధాలు తినే సమయంలో ఉండాల్సిందే. వంటలకు మరింత రుచిని ఇవ్వడానికి మసాలాను జోడిస్తారు. వంటకానికి అద్భుతమైన రుచిని జోడించడానికి మసాలాలు అతిపెద్ద పాత్ర పోషిస్తాయి. మార్కెట్‌లో దొరికే మసాలా దినుసులన్నింటిలో కల్తీ జరుగుతోందన్న వార్తలు వస్తున్న ఈ రోజుల్లో ఇంట్లోనే వాటిని తయారుచేసుకోవచ్చు. అవును మసాలా తయారీ చేయడం కష్టమైన పని కాదు. ఈ రోజు బిర్యానీ మసాలాను చాలా సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.. ఈ పద్ధతిలో మసాలా దినుసులతో తయారు చేసిన బిర్యానీని తయారుచేసుకుని తింటే మార్కెట్‌లో లభించే బిర్యానీ మసాలాల వైపు దూరంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో బిర్యానీ మసాలా రెసిపీని తెలుసుకుందాం..
బిర్యానీ మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు
- పచ్చి యాలకులు – 15
- దాల్చిన చెక్క – 3
- నల్ల యాలకులు – 2
- స్టార్ పువ్వు – 2
- జాజికాయ – 1
- లవంగాలు – 15
- జాపత్రి – 2
- బే ఆకులు – 3
- ఎండు మిర్చి – 5-6
- నల్ల మిరియాలు – 1 స్పూన్
- జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
- ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
- మరాటి మొగ్గు-2
తయారీ విధానం:
- బిర్యానీ మసాలా చేయడానికి.. గ్యాస్ స్టవ్ వెలిగించి ముందుగా మందపాటి అడుగున ఉన్న పాన్ తీసుకోండి.
- వేడి ఎక్కిన తర్వాత బే ఆకులు,ఎండు మిరపకాయలను వేసి రంగు మారి సువాసన వచ్చే వరకూ డ్రై రోస్ట్ చేయండి.
- ఇప్పుడు పాన్ నుంచి బే ఆకులు,ఎండు మిరపకాయలను తీసి ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టండి.
- ఆ తర్వాత అదే బాణలిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించండి
- రంగు మారడం, వాసన రావడం ప్రారంభించినప్పుడు.. దానిని జీలకర్ర, ధనియాలను తీసి పక్కన పెట్టండి.
- ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన పదార్థాలన్నీ వేసి వాసన రావడం మొదలయ్యే వరకు వేయించాలి.
- ఇలా చేసిన తర్వాత బ్లెండర్ తీసుకొని అందులో బే ఆకులు, ఎండు మిరపకాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి.
- దీని తరువాత ఇతర పదార్థాలను మెత్తగా, పొడిని చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి రంగును తీసుకురావడానికి చివర్లో కొంచెం పసుపు వేయండి.
- అంతే బిర్యానీ మసాలా సిద్ధంగా ఉంది. దీన్ని ఎయిర్ టైట్ జార్ లో లేదా గాజు సీసాలో భద్రపరచుకుంటే ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..