Health Benefits: ఈ చిన్న ఆకుపచ్చ కూరగాయతో ఎన్ని లాభాలో తెలుసా..? గుప్పెడంత గుండెకు..

|

Aug 05, 2023 | 10:25 AM

గ్రీన్ వెజిటేబుల్స్ అందరికి నచ్చవు. కానీ, ఇది గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆకుపచ్చటి బ్రోకలీ విటమిన్లు, పోషకాల మంచి మూలం. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రోకలీ అంటే ఇష్టం లేకపోయినా సరే..కానీ, ఇది మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. శాస్త్రవేత్తలు బ్రోకలీని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.

1 / 5
బ్రోకలీ..ఈ చిన్న పచ్చి కూరగాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది..గుండె ఆరోగ్యం నుండి జీర్ణక్రియ వరకు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. మీరు ఈ గ్రీన్ వెజీటేబుల్‌ని ఎందుకు తీసుకోవాలో ముఖ్యమైన కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
బ్రోకలీలో సల్ఫోరాఫేన్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను నిరోధించడానికి, క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి సహాయపడుతుంది.ఇందులో ఉండే పీచు పదార్థం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్రోకలీలో విటమిన్ కె ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
బ్రోకలీలో గ్లూకోరాఫానిన్, విటమిన్ సి ఉంటాయి.  ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. బ్రాకోలీలో ఫైబర్ అధికంగా, తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గడానికి ఒక గొప్ప కూరగాయ.

4 / 5
బ్రోకలీలో విటమిన్ B, విటమిన్‌ C లు పుష్కలంగా ఉన్నాయి. దాంతో ఇది మీ జుట్టును బలపరుస్తుంది. అంతేకాదు.. జుట్టును మందంగా, ఆరోగ్యంగా చేయడానికి సహాయపడుతుంది.

5 / 5
బ్రోకలీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.