Badam Benefits: బాదంతో షుగర్ బాధ తీరిపోయినట్లే.. పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

బాదం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయోమో? అని అనుమానం పడతారు. ఇలాంటి అనుమానాలకు చెక్ చెబుతూ కొన్ని పరిశోధనలు వెలువడ్డాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు బాదం పప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు నిర్ణీత మొత్తంలో బాదంపప్పు తింటే బ్లడ్ షుగర్ గణనీయంగా తగ్గుతుందని వెల్లడైంది.

Badam Benefits: బాదంతో షుగర్ బాధ తీరిపోయినట్లే.. పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి
Almond

Edited By: Anil kumar poka

Updated on: Jan 21, 2023 | 8:16 PM

కరోనా మహమ్మారి ఇండియాలోకి ప్రవేశించాక రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను రోజూ తింటున్నారు. డ్రై ఫ్రూట్స్ లో కచ్చితంగా ఉండేది బాదం పప్పు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం బాదం విషయంలో కొంత ఆలోచనతో ఉంటారు. బాదం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయోమో? అని అనుమానం పడతారు. ఇలాంటి అనుమానాలకు చెక్ చెబుతూ కొన్ని పరిశోధనలు వెలువడ్డాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు బాదం పప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు నిర్ణీత మొత్తంలో బాదంపప్పు తింటే బ్లడ్ షుగర్ గణనీయంగా తగ్గుతుందని వెల్లడైంది. అయితే ఈ పరిశోధనలో తేలిన మిగిలిన విషయాలపై ఓ లుక్కేద్దాం.

యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో భోజనానికి 30 నిమిషాల ముందు 20 గ్రాముల బాదం పప్పును తింటే షుగర్ పెరుగుదలను తగ్గిస్తుందని తేలిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇండియాలో ఫాస్టింగ్ షుగర్ గురించే ఎక్కువ బాధపడతారు. అయితే భోజనం తర్వాత వచ్చే షుగర్ హెచ్చుతగ్గులను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టైప్ 2 డయాబెటిస్ కు మొదటి సూచనగా భోజన అనంతరం షుగర్ లెవల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే షుగర్ లెవెల్స్ ను స్థిరీకరించకుంటే సాధారణంగా ఫాస్టింగ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి భోజనానికి ముందు బాదం తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

ధీర్ఘకాలిక అధ్యయనం కోసం పరిశోధకులు మూడు నెలల పాటు రోగులను ట్రాక్ చేశారు. వీరిలో సీరం ఇన్సులిన్, గ్లైసెమిక్ లెవెల్స్ స్థిరంగా ఉన్నాయని తేలింది. అలాగే హెచ్ బీఏ1సీ, పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్, లిపిడ్ స్థాయిలు తగ్గాయి. అయితే మధుమేహం అనేది సైలెంట్ కిల్లర్ అని అందరికీ తెలిసిందే. అయితే పరిశోధనలు చేసిన వారిలో సగం మందికి ప్రీడయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని తెలింది. కాబట్టి వీరు తరచూ బాదం పప్పు తింటే షుగర్ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

ఇవి కూడా చదవండి

టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు రోజూ బాదం తింటే గుండె సంబంధిత సమస్య ల నుంచి కూడా బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు సంపన్న వర్గాల్లో మాత్రమే కనిపించే టైప్ 2 డయాబెటిస్ మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా అందరిలో కనిపిస్తుందని పేర్కొంటున్నారు. కాబట్టి కచ్చితంగా డైట్ ప్లాన్ లో బాదం చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…