Black Carrot Halwa: నల్లగా ఉన్నా తగ్గేదేలే అంటున్న నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..

|

Jan 09, 2025 | 8:03 PM

చలికాలంలో క్యారెట్ హల్వా తినడం విభిన్నమైన ఆనందాన్ని ఇస్తుంది. అయితే హల్వా లో అనేక రకాలున్నాయి. క్యారెట్ హల్వా, సుజీ హల్వా, గాజర్ హల్వా, బీట్ రూట్ హల్వా వంటి అనేక రకాల హల్వాలు తరచుగా కనిపిస్తాయి. అయితే ఎక్కువగా హల్వా పసుపు, నారింజ రంగు క్యారెట్ లతో తయారు చేస్తారు. అయితే భారతదేశంలో బ్లాక్ క్యారెట్ హల్వా దొరుకుతుందని మీకు తెలుసా? అవును నల్ల క్యారెట్ హల్వాను నవాబుల నగరమైన లక్నోలో తయారు చేస్తారు.

Black Carrot Halwa: నల్లగా ఉన్నా తగ్గేదేలే అంటున్న నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
Black Carrot Halwa
Follow us on

చలికాలం రాగానే అందరూ వేడివేడిగా క్యారెట్ హల్వా తినాలనుకుంటారు. ఎరుపు లేదా పసుపు క్యారెట్‌లతో తయారు చేయబడిన ఈ సాంప్రదాయ స్వీట్.. నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ తో తయారు చేస్తారు. భిన్నమైన టేస్ట్ తో ప్రసిద్ధి చెందింది. అయితే క్యారెట్ హల్వాకు ప్రత్యేకమైన గుర్తింపు.. టెస్టు ఇచ్చే భారతదేశంలో ఒక నగరం ఉందని మీకు తెలుసా? ఈ నగరంలో క్యారెట్ హల్వాను నలుపు క్యారెట్‌లతో తయారు చేస్తారు. ఈ హల్వాకు ప్రత్యేకమైన రంగు ఉన్నప్పటికీ రుచి విషయంలో ఎక్కడా తగ్గేదే లే అంటుంది. ఈ ప్రత్యేక హల్వా లక్నోలో దొరుకుతుంది. చలికాలంలో లక్నోలోని స్వీట్ షాపుల్లో బ్లాక్ క్యారెట్ హల్వా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సోషల్ మీడియాలో మరూఫ్ కుల్మాన్ అనే వినియోగదారుడు ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో లక్నోలో ఈ హల్వా చాలా స్పెషల్. అంటూ దీని ప్రత్యేకత గురించి చెప్పాడు. “శీతాకాలంలో లక్నో అనేక రకాల ఆనందాలను అనుభవించవచ్చు. అయితే బ్లాక్ క్యారెట్ హల్వా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. రెడ్ క్యారెట్ హల్వాలా కాకుండా.. ఇది అరుదైన స్వీట్. ఇది శీతాకాలంలో మాత్రమే లభిస్తుంది. దీనికి కారణం నల్ల క్యారెట్ పంట చాలా పరిమితంగా ఉంటుంది. కొంతమంది రైతులు మాత్రమే దీనిని పండిస్తారు. ఈ హల్వా చాలా ప్రత్యేకమైనది.

బ్లాక్ క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలంటే

మరూఫ్ వీడియో ప్రకారం.. ఈ ప్రత్యేకమైన హల్వాను తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్థానిక మిఠాయి దుకాణంలోని తయారీదారులు స్థానిక రైతుల నుంచి ఎంపిక చేసిన నల్ల క్యారెట్లను ఖరీదు చేస్తారు. దీని తరువాత వాటిని బాగా శుభ్రం చేసి కడుగుతారు. తర్వాత వాటిని తురుముతారు. అలా తురిమిన క్యారెట్లను పాలలో ఉడికించి.. బాగా దగ్గరగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని దేశీ నెయ్యిలో బాగా వేయిస్తారు బాగా చిక్కగా దగ్గరగా వచ్చిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పులు జోడిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
Maroof Umar | ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్ హెరిటేజ్ స్టోరీటెల్లర్ (@maroofculmen)

ఈ హల్వా ఎందుకు ప్రత్యేకం?

బ్లాక్ క్యారెట్ హల్వా రుచిలో సాటిలేనిది మాత్రమే కాదు. ఇది తక్కువగా దొరుకుతుంది. ఈ హల్వా శీతాకాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే నల్ల క్యారెట్లను చల్లని వాతావరణంలో మాత్రమే పండిస్తారు. దాని తీపి, నెయ్యి సువాసన, డ్రై ఫ్రూట్‌ అదనపు రుచిని ఇస్తాయి. దీంతో దీనిని తినే వారి హృదయాలలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. మీరు శీతాకాలంలో లక్నో సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఈ స్పెషల్ బ్లాక్ క్యారెట్ హల్వాని తప్పకుండా ప్రయత్నించండి. ఇది కేవలం స్వీట్ మాత్రమే కాదు ఒక మధుర జ్ఞాపకం కూడా.

బ్లాక్ క్యారెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

కంటి ఆరోగ్యానికి మేలు: ఆరెంజ్ క్యారెట్ లాగానే బ్లాక్ క్యారెట్ లో కూడా బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ ఎ ఒక రూపం, ఇది కంటి చూపుకు చాలా ముఖ్యమైనది. బ్లాక్ క్యారెట్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

జీర్ణవ్యవస్థ బలోపేతం : బ్లాక్ క్యారెట్‌లో చాలా ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగుల కదలికలను కాపాడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. అదనంగా ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి బూస్టర్: బ్లాక్ క్యారెట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..