Ayurveda Helath Tips: ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పురుషులకు దివ్య ఔషధం.. అరటిపండు నెయ్యి మిశ్రమం

|

Apr 17, 2022 | 7:00 PM

Ayurveda Helath Tips: ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పండ్లు అరటి పండ్లు(Banana). అరటిపండులో ఔషగుణాలు మెండు.. అందుల్లనే వీటి ప్రకృతి ఇచ్చిన ప్రసాదంగా భావిస్తారు. సీజన్ తో సంబంధం..

Ayurveda Helath Tips: ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పురుషులకు దివ్య ఔషధం.. అరటిపండు నెయ్యి మిశ్రమం
Banana With Ghee Benefits
Follow us on

Ayurveda Helath Tips: ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పండ్లు అరటి పండ్లు(Banana). అరటిపండులో ఔషగుణాలు మెండు.. అందుల్లనే వీటి ప్రకృతి ఇచ్చిన ప్రసాదంగా భావిస్తారు. సీజన్ తో సంబంధం ఏడాదిలో ప్రతి రోజూ దొరికే అరటి పండుని రోజూ తినే ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే.. అయితే ఉదయం అరటిపండులు.. వీటితో కలిపి తినడం వలన మేలు జరుగుతుంది. ముఖ్యంగా యోగా, వ్యాయామం చేసే పురుషులు అరటి పండును నెయ్యితో కలిపి పరగడుపునే తినడం వలన కలిగే ప్రయోజనాలు గురించి ఆయుర్వేదంలో ప్రత్యేకంగా తెలిపారు. ఈరోజు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

  1. బరువు తక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం పరగడుపున అరటిపండును నెయ్యితో కలిపి తినడం వలన బరువు పెరుగుతారు. అంతేకాదు.. కండరాలు ధృడంగా తయారవుతాయి.
  2. రోజూ ఉదయం వ్యాయామం, యోగ చేసే అరటిపండు నెయ్యి తినడం వలన తక్షణ శక్తి లభిస్తుంది.
  3. అలసటకు గురయ్యేవారు, శారీరక శ్రమ అధికంగా చేసే వారు అరటిపండు, నెయ్యి కలిపి తినడం వలన హుషారుగా ఉంటారు.
  4. మలబద్దకం సమస్యతో ఇబ్బందిపడేవారు.. అరటిపండు, నెయ్యితో కలిపి తినడం వలన సమస్య నివారించబడుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
  5. అరటి పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెరుగుపరచి.. ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
  6. ముఖ్యంగా లైంగిక సమస్యలతో ఇబ్బందిపడే పురుషులకు మంచి మెడిసిన్ అరటిపండు నెయ్యి మిశ్రమం. ఈ మిశ్రమం తినటం వల్ల వీర్య కణాల సంఖ్య వృద్ధి అవుతాయి. పురుషులలో శృంగార సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
  7. చర్మం కాంతి విహీనంగా ఉన్నవారు రోజూ ఉదయం అరటిపండు నెయ్యి మిశ్రమం తినటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

Note :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Also Read:Yoga Poses: మహిళలు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ ఐదు యోగాసనాలు ట్రై చేయండి