Aloe Vera Laddu: కలబంద ఔషదాల గని.. దీనివలన ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఆయుర్వేదంలో కూడా కలబందను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కలబందను ఔషదాల తయారీకి, అందం మెరుగు పరచుకోవడానికే కాదు ఆహార పదార్ధాలను తయారు చేసుకోవడంలో ఉపయోగిస్తారు. ఈరోజు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే కలబందతో లడ్డూలు తయారు చేసుకోవడం తెలుసుకుందాం..
కలబంద లేత కొమ్మల గుజ్జు
గోధుమ పిండి
ఆవు నెయ్యి
బెల్లం/తాటి బెల్లం
జీడిపప్పు
బాదాం పప్పు
కిస్ మిస్
ముందుగా చిన్న కలబంద లేత కొమ్మలోని గుజ్జుని తీసుకోవాలి. తర్వాత స్టౌ మీద స్విమ్ లో పెట్టి బాణలి పెట్టి.. ఆవు నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత కలబంద గుజ్జుని వేసి దోర ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించాలి. అనంతరం గోధుమ పిండిని కూడా ఆవు నెయ్యిలో వేసి.. దోర రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత పాత బెల్లం కానీ తాటి బెల్లం తీసుకుని కళాయి పాత్రలో వేసి చిన్న మంటపైన పాకం పట్టాలి. లేత పాకం రాగానే అందులో పైన వేయించి పెట్టుకున్న కలబంద గుజ్జును గోధుమ పిండి వేసి బాగా కలగలిపి .. నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసుకుని దించుకోవాలి. ఈ మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా అయిన తరువాతకావాల్సిన సైజులో లడ్డుల్లా చుట్టుకుని గాజు సీసాలో భద్ర పరచుకోవాలి.
ఈ కలబంద లడ్డూలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఎంతో కాలం నుంచి భరించలేనంత కీళ్లవాతంతో, నడుము నొప్పులతో బాధపడేవారికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాదు మూత్రం అతికష్టంగా వచ్చే సమస్యతో బాధపడేవారు వ్యాధి తీవ్రతను బట్టి రెండు పూటలా ఒకటి లేదా రెండు లడ్డులనూ తింటుండాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.
Also Read: ఆక్వారంగంలో లాభాలను తెచ్చిపెడుతున్న పీతల పెంపకం.. ఈజీగా ఎలా పెంచాలంటే..