Milk Side Effects: ఈ పదార్థాలను పాలతో కలిపి తీసుకుంటున్నారా.. అయితే వెంటనే మానేయండి..

|

Mar 28, 2022 | 7:30 PM

పాల(Milk)తో కలిపి ఈ పదార్థాలను తీసుకుంటే మీ పని అంతే ఇక.. ప్రతి రోజు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన విషయమే.

Milk Side Effects: ఈ పదార్థాలను పాలతో కలిపి తీసుకుంటున్నారా.. అయితే వెంటనే మానేయండి..
Milk
Follow us on

పాల(Milk)తో కలిపి ఈ పదార్థాలను తీసుకుంటే మీ పని అంతే ఇక.. ప్రతి రోజు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన విషయమే. ఎందుకంటే పాలలో ఉండే పోషక పదార్ధాలు ఆరోగ్యాని(health)కి మంచివి. రోజూ క్రమం తప్పకుండా పాలు తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. కాల్షియం ఇందుకు దోహదపడుతుంది. అయితే పాలతో పాటు కొన్ని రకాల పదార్థాలు కలిపి తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం. పాలు లేదా పెరుగుతో చేపలు అస్సలు తినకూడదు. ఇలా చేస్తే అజీర్తి సమస్య వస్తుంది. అటు పాలతో చికెన్(chicken) కూడా తీసుకోకూడదు. చికెన్, పాలు కలిపి తీసుకోవడం వలన.. గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు మినపప్పు పదార్ధాలు కూడా పాలతో తీసుకోకూడదు. మినుములో ఉండే పోషక పదార్ధాలు పాలతో కలిస్తే..వాంతులు, కడుపు బరువెక్కడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పాలతో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవద్దు. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ద్రాక్ష, నిమ్మకాయలు, ఆరెంజ్ వంటి పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పాలతో పాటు తీసుకోకూడదు. ఇలాచేస్తే కడుపు నొప్పి రావొచ్చు. పాలు, పెరుగు తీసుకున్న రెండు గంటల తరువాత నువ్వులు, ఉప్పు పదార్ధాల్ని తీసుకుంటే మంచిది. అలాగని కలిపి ఒకేసారి తీసుకోకూడదు. అదే సమయంలో పనస, కాకరకాయల్ని కూడా పాలతో (Milk) కలిపి తీసుకోకూడదు. దీనివల్ల దురద, సోరియాసిస్ వంటి సమస్య ఎదురవుతుంది. ఆవు పాలలో లాక్టోస్ ఉంటుంది. ఈ లాక్టోస్ జీర్ణ వ్యవస్థకు చికాకు కలిగించి దానివల్ల గ్యాస్ వస్తుంది.

Read Also.. Healthy Foods: ఎండాకాలం వేడి భరించలేకపోతున్నారా.. ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోండి..!