ఐస్ క్రీం తినడానికి కాలంతో సంబంధం లేదు. వేసవిలోనే తినాలనే రూల్ లేదు. జోరుగా వర్షం పడుతుంటే ఐస్ క్రీం తినడం ఓ గమ్మత్తైన అనుభవం.. ఓ వైపు చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంటే చల్లటి ఐస్ క్రీం తినేయాలని అనుకునేవారు కూడా చాలా మంది ఉంటారు. అలా తింటే సూపర్ అంటారు నేటి తరం యువత. అందుకే ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఐస్ క్రీంలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఫ్రూట్స్ తో చేసేవి, ఆర్గానిక్ ఐస్ క్రీంలు.. ఇలా అనేక రకాలు, అనేక బ్రాండ్లు మార్కెట్‌లో వచ్చేశాయి. మీరే ఇంట్లో అలాంటి ఓ టేస్టీ అండ్ హెల్తీ ఐస్ క్రీం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది యాపిల్ పండ్లతో చేసుకునే ఐస్ క్రీం. ఈ కశ్మీరీ యాపిల్‌లో ఎన్నో పోషక విలువలుంటాయి. వీటితో ఐస్ క్రీం తయారు చేస్తే.. పిల్లలు, పెద్దలు పోటీలు పడి మరీ ఖాళీ చేస్తేస్తారు. మీరు దీన్ని రుచికరమైన డెజర్ట్‌గా కూడా అందించవచ్చు. ఈ ఐస్ క్రీం ఏదైనా ప్రత్యేక సందర్భంలో కూడా తయారు చేయవచ్చు. ఈ రెసిపీ తెలుసుకుందాం.
దశ 1
కొన్ని యాపిల్ పొట్టు తీయండి. కట్ చేయండి. పక్కన పెట్టండి.
దశ – 2
తరిగిన యాపిల్స్‌ను పాన్‌లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
దశ – 3
పాన్‌లో కొద్దిగా నీళ్లు పోసి యాపిల్స్ మెత్తబడే వరకు ఉడికించాలి.
దశ – 4
పాన్‌లో రుచికి తగినట్లుగా వెన్న, చక్కెర వేసి బాగా ఉడికించాలి.
దశ – 5
ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లబరచండి.
దశ – 6
మరొక గిన్నెలో హెవీ క్రీమ్, చిక్కని గడ్డ కట్టిన పాలు, వనిల్లా ఎసెన్స్ జోడించండి.
దశ – 7
క్రీమ్ మిశ్రమంలో ఆపిల్ మిశ్రమాన్ని పోయాలి. అన్ని పదార్థాలను బాగా కలపండి.
దశ – 8
మీకు నచ్చిన టాపింగ్స్‌పై చల్లుకోండి లేదా ఒక కంటైనర్‌లో పోసి ఫ్రీజ్ చేయండి.
దశ – 9
ఫ్రీజర్ నుండి ఐస్ క్రీం తీసి ఒక గిన్నెలో తీయండి.
దశ – 10
పైన చాక్లెట్ సాస్, స్ప్రింక్లర్లు లేదా చాకో చిప్స్ చల్లి ఆనందించండి.
ఆపిల్ గురించి ఒక ప్రసిద్ధ సామెత ఉంది. అనేక పోషకాలు ఈ పండులో ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు . అందుకనే రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండ్లను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా న్యుమోనియా వ్యాధి రాకుండా యాపిల్ చేయగలదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలు..విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫైబర్, మినరల్స్ తోపాటు అనేక ఇతర పోషకాలను ఇందులో ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది –
యాపిల్స్ ఆరోగ్యకరమైన ఆహారంలో చేర్చవచ్చు. ఇది గుండెను మెరుగుపరుస్తుంది. కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఊబకాయం, బరువును తగ్గించడంలో సహాయపడుతుంది –
యాపిల్ అనేది ఫైబర్ అధికంగా ఉండే పండు. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. యాపిల్స్‌లో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడే ఖనిజ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో ఉండే విటమిన్ K రక్త ప్రసరణను సాఫీగా ఉంచుతుంది.
చర్మానికి మేలు –
మీ చర్మాన్ని మెరుగుపరచడానికి .. ఆరోగ్యంగా ఉంచడానికి యాపిల్స్ గొప్పగా పనిచేస్తాయి. మెరిసే చర్మం కావాలనుకుంటే మాత్రం మీరు గ్రీన్ ఆపిల్ తినవచ్చు.
ఇవి కూడా చదవడి: బిగ్ బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.? హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!