
బంగాళాదుంపని ఉపయోగించి చాలా వంటకాలు చేయవచ్చు. ఆలూతో కూరలు మాత్రమే కాదు ఆలూ బొండా, ఆలూ బజ్జి, ఆలూ 65 వంటి రకరకాల స్నాక్స్ ని కూడా చేసుకోవచ్చు. దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఉద్భవించిన ఆలూ 65 దేశవ్యాప్తంగా, వెలుపల విస్తృత ప్రజాదరణ పొందింది. ఆలూ 65 అనేది త్వరగా తయారు చేసుకునే స్టార్టర్ లేదా స్నాక్. దీనిని ఏ సమయంలోనైనా ఆస్వాదించవచ్చు. ఈ రోజు క్షణాల్లో తయారు చేసుకోగల అద్భుతమైన స్నాక్ ఆలూ 65 లేదా బంగాళాదుంప 65 రెసిపీ గురించి తెలుసుకుందాం..
తయారు చేసే విధానం: ముందుగా బంగాళాదుంపలను కుక్కర్ పెట్టి.. 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి, ఎర్ర కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. తరవాత రుచికి సరిపడా ఉప్పు వేసి నీరు వేసి మ్యారినేట్ సిద్ధం చేయాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపలను ముక్కలుగా కట్ చేసి.. రెడీ చేసుకున్న మిశ్రమంలో వేసి.. పిండి బంగాళా దుంప ముక్కలకు అద్దుకునే విదంగా కవర్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి.. వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఈ నూనె లో , మ్యారినేట్ చేసిన బంగాళాదుంప ముక్కలను వేసి.. మీడియం మంట మీద బంగారు గోధుమ రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయండి. . చాలా టేస్టీగా, స్పైసీగా ఉండే ఆలూ 65రెడీ. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని కరివేపాకు వేసి, నిమ్మరసం, చాట్ మసాలా పొడి చల్లి వేడి వేడిగా సర్వ్ చేయండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..