Brain Health: ఇవి తింటే మెదడు బాగా పనిచేస్తుంది.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.. వెంటనే డైట్‌లో చేర్చుకోండి

|

Aug 03, 2022 | 12:58 PM

Brain Health Tips: శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అందులోనూ పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం బాగా తీసుకోవాలి.

Brain Health: ఇవి తింటే మెదడు బాగా పనిచేస్తుంది.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.. వెంటనే డైట్‌లో చేర్చుకోండి
Brain Health
Follow us on

Brain Health Tips: శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అందులోనూ పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం బాగా తీసుకోవాలి. ముఖ్యంగా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని కూరగాయల్లో కంటికి మేలు చేసే విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. మరికొన్ని కూరగాయల్లో చర్మానికి , రోగనిరోధక వ్యవస్థకు మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. కాగా శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే, మెదడుకు కూడా అవసరమైన మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు అవసరం. తద్వారా మన ఏకాగ్రతను పెంచుకోవచ్చు. జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోవచ్చు. అలాగే పని ఉత్పాదకతను పెంచుకోవచ్చు. మరి మన మెదడు పనితీరును మెరుగుపరిచే కొన్ని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.

బీట్‌రూట్
ఇందులో నైట్రేట్స్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా నైట్రేట్లు మెదడుకు రక్త సరఫరా ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B9, అల్జీమర్స్ వంటి రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బ్రోకలీ 
బ్రోకలీ, కాలీఫ్లవర్ లాంటివి మెదడుకు ఆరోగ్యకరమైన కూరగాయలు. వీటిలో విటమిన్ కె ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్
ఈ కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా సహాయపడతాయి.

క్యారెట్లు
క్యారెట్లు, చిలగడదుంపలు, ఎర్ర మిరియాలు తదితర కూరగాయల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీటా-కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరానికి ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ని ఆపుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..