Bodybuilding Tips: కండలవీరుడిగా మారాలనుకుంటున్నారా..? జిమ్ చేస్తే సరిపోదు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే..

|

Feb 18, 2022 | 1:18 PM

Bodybuilding Tips in Telugu: ప్రస్తుత సమాజంలో చాలామంది శరీరాకృతి కోసం నిత్యం శ్రమిస్తుంటారు. ఇందుకోసం జిమ్‌లు, పార్కుల చుట్టూ చక్కెర్లు కొడుతూ.. తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడంతోపాటు..

Bodybuilding Tips: కండలవీరుడిగా మారాలనుకుంటున్నారా..? జిమ్ చేస్తే సరిపోదు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే..
Bodybuilding Tips
Follow us on

Bodybuilding Tips in Telugu: ప్రస్తుత సమాజంలో చాలామంది శరీరాకృతి కోసం నిత్యం శ్రమిస్తుంటారు. ఇందుకోసం జిమ్‌లు, పార్కుల చుట్టూ చక్కెర్లు కొడుతూ.. తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడంతోపాటు.. శరీర సౌందర్యాన్ని మెరుగుపర్చుకుంటుంటారు. మంచి శరీరాకృతి కోసం.. కండరాలు (Gain Muscle) పెంచుకోవాలనుకుంటే.. జిమ్‌ చేయడం.. ఎక్సర్‌సైజ్ మాత్రమే కాదు. ఆహారంపై కూడా దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు ఫిట్నెస్ ట్రైనర్లు. మీరు కోరుకున్న ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి మీ దినచర్యలో పోషకాహారాన్ని చేర్చుకోవడం ముఖ్యమంటున్నారు. మన శరీరం.. బిల్డింగ్ బ్లాక్స్‌గా పనిచేసే ప్రోటీన్లు బరువు తగ్గడంలో, కండరాల పెరుగుదలలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయితే.. కండరాల పెరుగుదల కోసం మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఐదు ప్రోటీన్-రిచ్ (high protein diet) ఆహారాల గురించి తెలుసుకోండి..

గుడ్లు..

గుడ్లు ప్రోటీన్లు, పోషకాలు సులభంగా లభించే సూపర్ ఫుడ్. గుడ్లను పూర్తి వ్యాయామం తర్వాత తీసుకుంటే.. కండరాల పునరుద్ధరణలో సహాయపడతాయి. అలాగే గుడ్డు పచ్చసొన మీ గుండెకు హానికరం అని కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ.. గుడ్లు ప్రోటీన్ పవర్‌హౌస్‌గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

చికెన్ బ్రెస్ట్‌లు

చికెన్ బ్రెస్ట్‌లు కండరాల పెరుగుదలకు తగిన ప్రోటీన్‌ను అందిస్తాయి. అందుబాటులో దొరికే చికెన్ బ్రెస్ట్‌లో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది. చికెన్ బ్రెస్ట్‌లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 32 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

క్వినోవా..

సిరి ధాన్యాలతో చేసే శాఖాహార.. క్వినోవా ఆహారం.. అద్భుతమైన ప్రోటీన్‌లను అందిస్తుంది. ఇది ఒక కప్పుకు 8 గ్రాముల ప్రోటీన్‌ లభిస్తుంది. అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. మంచి కండరాల నిర్మాణం కోసం మీరు ప్రోటీన్ తీసుకోవాలనుకుంటే.. కూరగాయలు లేదా చికెన్‌తో క్వినోవా తినడం మంచిది.

తృణ ధాన్యాలు – వాల్‌నట్స్..

అల్పాహారం చేయడం వలన మీ కండరాల పెరుగుదలతోపాటు..ఆకలి బాధలను దూరం చేస్తుంది. అయితే.. ఉదయాన్నే తృణ ధాన్యాలు, వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు.. కండరాలు కూడా బలోపేతం అవుతాయని ఫిట్నెస్ ట్రైనర్లు అభిప్రాయపడుతున్నారు.

పప్పు ధాన్యాలు..

దాదాపు ప్రతి ఇంట్లో పప్పు ధాన్యాలు ఉంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిల్లో కొవ్వు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇతర ప్రోటీన్ ఫుడ్‌తో పోలిస్తే.. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వీటిని బ్రౌన్ రైస్‌తో తింటే మంచి ఫలితం ఉంటుంది.

Also Read:

Foods Never Expire: ఈ ఫుడ్స్ ఎప్పటికీ ఎక్స్‏పైర్ అవ్వవు.. ఎన్నాళ్లనై తినొచ్చంట.!

Weight Loss: నిత్యం ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఇది మీ వల్ల అవుతుందా..?