Onion Health Benefits: వేసవిలో ఉల్లి మేలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

| Edited By: Ravi Kiran

Apr 01, 2022 | 6:50 AM

Onion Health Benefits In Summer: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామేత తరుచూ వింటుంటా. ఎందుకంటే.. ఉల్లిపాయలు కేవలం వంటలో రుచి కోసమే కాదు.. ఆరోగ్యకరంగా ఉండేందుకు

Onion Health Benefits: వేసవిలో ఉల్లి మేలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Onions
Follow us on

Onion Health Benefits In Summer: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామేత తరుచూ వింటుంటా. ఎందుకంటే.. ఉల్లిపాయలు కేవలం వంటలో రుచి కోసమే కాదు.. ఆరోగ్యకరంగా ఉండేందుకు కూడా దోహదపడతాయి. అందుకే ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తరుచూ సూచిస్తుంటారు. ఉల్లిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉల్లిపాయలలో విటమిన్-బి, ఫోలేట్ (బి9), పిరిడోసిన్ (బి6) పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో జీవక్రియ, నరాల పనితీరు, ఎర్ర రక్త కణాలను పెంచడానికి పని చేస్తాయి. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్, సల్ఫర్, ప్రోటీన్ తోపాటు పలు ఖనిజాలు కూడా ఉంటాయి. వేసవిలో ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో ఉల్లిపాయ ప్రయోజనాలు

బ్లడ్ షుగర్: ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఒక పరిశోధనలో.. ఉల్లిపాయల వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని తేలింది. అలాగే, అవి శరీరంలో హైపోగ్లైసీమిక్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లకు డైటరీ సప్లిమెంట్‌గా పని చేస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది: ఉల్లిపాయలో చల్లదనంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో దీనిని తీసుకోవడం ద్వారా చల్లదనాన్ని పొందుతాము. ఇది వేసవిలో మీ శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది.

వడదెబ్బ నుంచి రక్షణ: వేసవిలో వడదెబ్బ బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉల్లిపాయల వినియోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయలో తగినంత మొత్తంలో ద్రవాలు ఉంటాయి. ఇవి రోజంతా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఉల్లిపాయల వినియోగం వేడి నుంచి కాపాడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఇవి తినే వ్యక్తులు క్యాన్సర్ నుండి త్వరగా కోలుకుంటారని ఓ అధ్యయనంలో తెలిసింది.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది: ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటతో పోరాడటానికి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. అలాగే ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

Also Read:

Insomnia: రాత్రిళ్లు సరిగా నిద్రపట్టడం లేదా? అయితే ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే..

Health News: అన్ని వయసుల పురుషుల కోసం సూపర్ డైట్‌ ఇదే.. కచ్చితంగా పాటించాల్సిందే..!