Salt
మనం సూపర్ మార్కెట్ నుంచి ఏదైనా ఆహార సామాగ్రిలను కొనుగోలు చేసినప్పుడు.. ముందుగా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్.. అలాగే ఎక్స్‌పైరీ డేట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అయితే ఎప్పటికీ ఎక్స్‌పైరీ డేట్ ముగియని కొన్ని వంటింటి ఐటెమ్స్, ఆహారాలు ఉన్నాయి. అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి.
ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం…
- వైట్ రైస్– 40 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలలో ఆక్సిజన్ లేని కంటైనర్‌లలో నిల్వ చేసినప్పుడు తెల్లటి (లేదా పాలిష్ చేసిన) బియ్యం 30 సంవత్సరాల పాటు దాని పోషక పదార్ధాలను, రుచిని కోల్పోకుండా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్‌ను అయితే 6 నెలల లోపు ఉపయోగించుకోవాలని అంటున్నారు. దాని ఊక పొరలో కనిపించే సహజ నూనెల వల్ల ఆ బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉండదని చెప్పారు.
- తేనె– సహజమైన రీతిలో చేసిన తేనె అస్సలు ఎక్స్‌పైర్ అవ్వదు. పువ్వుల నుంచి వచ్చే తేనె తేనెటీగల లోపల ఎంజైమ్‌లతో మిళితమై ఉంటుంది. ఇది తేనె కూర్పును మారుస్తుంది. అలాగే తేనెను ప్రాసెసింగ్, సీలింగ్ చేసేటప్పుడు ఉపయోగించే ప్రక్రియ కూడా దాని జీవితకాలం ఎక్కువ ఉండేలా చేస్తాయి. తేనెలోని చక్కెరలను హైగ్రోస్కోపిక్ అని అంటారు. అవి గాలి నుంచి తేమను తీసుకుంటాయి. వేడి చేసిన.. వడకపెట్టిన తేనెను సరిగ్గా సీల్ చేసినప్పుడు.. అది తేమను గ్రహించదు. తద్వారా తేనె ఎప్పటికీ ఎక్స్‌పైర్ కాకుండా ఉంటుంది.
- ఉప్పు– భూమి నుంచి సంగ్రహించిన ఖనిజం సోడియం క్లోరైడ్. ఇది తేమను తొలగిస్తుంది. అందుకే ఏ ఆహారాన్నైనా.. ఉప్పు దశాబ్దాలుగా సంరక్షించడానికి ఉపయోగపడుతుంది. అయితే మీ వంటింటిలోని ఉప్పు శాశ్వతంగా ఎక్స్‌పైర్ కాకుండా ఉండకపోవచ్చు. టేబుల్ సాల్ట్‌లో ఐయోడిన్‌ను జోడించడం వల్ల దాని లైఫ్ స్పాన్ తగ్గవచ్చు. అందుకే ఐయోడైజ్డ్ సాల్ట్ దాదాపు 5 సంవత్సరాలు పాటు నిల్వ ఉంటుంది.
- సోయాసాస్: సోయాసాస్‌ను తెరవకుండా ఉంచితే.. అది చాలాకాలం పాటు నిల్వ ఉంటుంది. ఒకవేళ తెరిచినా.. ఉప్పగా ఉండే ఆ మసాలాను మీ రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంచొచ్చు.
- చక్కెర– మీరు ఉపయోగించే పద్దతి బట్టి.. చక్కెర ఎక్కువ కాలం నిల్వ ఉంటుందో.. ఉండదో చెప్పేయొచ్చు. పొడి లేదా గ్రాన్యులేటెడ్ చక్కెరను ఎలప్పుడూ క్లోజ్డ్ కంటైనర్లలోనే ఉంచాలి. అప్పుడే అందులోకి తేమ చేరదు.
- అలాగే వీటితో పాటు ఎండిన బీన్స్, స్వచ్ఛమైన మాపుల్ సిరప్, పౌడర్డెడ్ మిల్క్, హార్డ్ లిక్కర్, పెమ్మికన్(Pemmican) లాంటి ఆహార పదార్ధాలు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.