
సమ్మర్ వచ్చిందంటే రోడ్లపై ఎక్కడ చూసినా పుచ్చకాయలు దర్శనమిస్తాయి. మండుటెండలో ఊరటనిచ్చే పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా పుచ్చకాయలోని వాటర్ కంటెంట్ సమ్మర్‌లో డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇదిలా ఉంటే మార్కెట్లో పదుల కొద్ది ఉండే పుచ్చకాయల్లో మంచి పండును ఎంచుకోవడం ఛాలెంజ్‌తో కూడుకున్న పని అవుతుంది. బయటకు బాగానే కనిపించినా, ఇంటికి రాగానే కాయను కట్ చేసి చూస్తే మాత్రం లోపల ఎర్రగా ఉండదు. దీంతో చేసేదేమిలేక పడేయాల్సి వస్తుంది. అయితే కాయను కట్ చేయకుండానే పుచ్చకాయ పండిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* పుచ్చకాయ తొడిమ ఉండే ప్రాంతం గట్టిగా ఎండినట్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే పుచ్చకాయ గట్టిగా ఉండే లోపల ఎర్రగా ఉంటుందని అర్థం. మెత్తగా ఉంటే అది లోపల పాడైనట్లు గుర్తించాలి.
* కాయ సైజ్‌తో సంబంధం లేకుండా చేతిలో పట్టుకున్న సమయంలో బరువుగా అనిపించాలి. అలా ఉంటే లోపల నీరు, గుజ్జు ఎక్కువగా ఉన్నట్లు అర్థం.
* ఇక వాసనను బట్టి కూడా మంచి కాయను ఎంచుకోవచ్చు. పుచ్చకాయను ముక్కుకు దగ్గరగా పెట్టుకుని.. వాసన చూస్తే తియ్యటి వాసన వస్తే అది పండినట్లు అర్థం. అయితే మరీ ఎక్కువ వాసన వచ్చినా అది కుళ్లినట్లు అర్థం చేసుకోవాలి.
* పుచ్చకాయను చేతిలోకి తీసుకొని కొట్టి పరీక్షించి కూడా పండో కాదో తెలుసుకోవచ్చు. ఇలా కొట్టినప్పుడు వెదురు కర్ర నుంచి వచ్చిన చప్పుడు వస్తే అది బాగా పండినట్లు అర్థం.
* కొన్ని పుచ్చకాయలపై గోధుమ రంగులో గీతలుంటాయి. ఇవి కూడా బాగా పండిన పండుకు లక్షణమని గుర్తించాలి. చూశారుగా ఈ సింపుల్ టెక్నిక్‌ను పాటించి ఇకపై మంచి పండును ఎంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..