Health: కఫంతో కూడిన దగ్గు వేధిస్తోందా.? ఈ సింపుల్ టిప్స్‌ ఫాలో అవ్వండి చాలు..

|

Oct 27, 2024 | 11:04 AM

దగ్గు సర్వసాధారణమైన సమస్య. అయితే కఫంతో కూడిన దగ్గు రావడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కఫంతో కూడిన దగ్గు వస్తుంటే కొన్ని రకాల చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకీ కఫంతో కూడిన దగ్గుకు ఎలాంటి చిట్కాలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: కఫంతో కూడిన దగ్గు వేధిస్తోందా.? ఈ సింపుల్ టిప్స్‌ ఫాలో అవ్వండి చాలు..
Cough
Follow us on

దగ్గు సర్వసాధారణమైన సమస్య. ప్రతీ ఒక్కరూ ఈ సమస్య బారినపడే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కఫంతో కూడిన దగ్గు మరింత ఎక్కువగా వేధిస్తుంటుంది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే ఎన్నో సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కఫంతో కూడిన దగ్గు ఎక్కువైతే అది ఛాతీ ఇన్ఫెక్షన్‌, న్యూమోనియా వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే కఫంతో కూడిన దగ్గుకు కొన్ని నేచురల్‌ టిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కఫంతో కూడిన దగ్గు తగ్గాలంటే.. అల్లం టీని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా కొన్ని రకాల వేడి వేడి సూప్స్‌ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యతగ్గుతుంది. గొంతులోని శ్లేష్మం తగ్గి ముక్కు నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఇక శ్లేష్మంతో కూడిన దగ్గుదో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని పుకిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్‌ దూరమై సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆవిరి పట్టుకోవడం వల్ల కూడా ఈ సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో పసుపు కలుపుకొని ఆవిరి పట్టుకోవడం వల్ల ఛాతిలో శ్లేష్మం దూరమై దగ్గు కూడా తగ్గుతుంది. తేనె కూడా కఫంతో కూడిన దగ్గును దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా గోరు వెచ్చని నీటిలో తేనె వేసుకొని తాగితే ఇలాంటి సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

అల్లం, మిరియాలు కూడా ఈ సమస్యను దూరం చేయడంలో దోహదపడుతాయి. వేడి నీటిలో అల్లం ముక్కలు, మిరియాలు వేసి బాగా కాచాలి. అనంతరం చల్లారిన తర్వాత వడుకట్టుకోని తాగాలి. ఇందులో కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా క్రమ తప్పకుండా రోజుకొకసారి తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల దగ్గు, కఫం సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పడగడుపన గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకొని తాగితే సమస్యలన్నీ తగ్గిపోతాయి.

దీర్ఘకాలంగా దగ్గు, కఫం సమస్యతో బాధపడుతుంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, లంగ్స్‌లో నీరు చేరడం వంటివి కూడా ఇందుకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా లంగ్‌ క్యాన్సర్‌కు కూడా ఇదే ప్రాథమిక సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..