Belly Fat: భారీ పొట్టతో ఇబ్బందిగా ఉందా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి..

|

Sep 12, 2024 | 8:41 PM

పొట్ట తగ్గాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్‌ అధికంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం తీసుకునే టిఫిన్‌లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఒత్తిడి కారణంగా ఎక్కువ మొత్తంలో తింటుంటారు. దీని కారణంగా అధిక బరువు సమస్య...

Belly Fat: భారీ పొట్టతో ఇబ్బందిగా ఉందా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి..
Belly Fat
Follow us on

ఇటీవల అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయసులో ఉన్న వారు కూడా ఈ సమస్యబారిన పడుతున్నారు. అయితే భారీ పొట్టను తగ్గించుకునేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. డైటింగ్ పేరుతో నోరు మాడ్చుకుంటారు. అయితే భారీ పొట్టను ఇట్టే తగ్గించేందుకు కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటి.? సహజంగా పొట్టను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్ట తగ్గాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్‌ అధికంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం తీసుకునే టిఫిన్‌లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఒత్తిడి కారణంగా ఎక్కువ మొత్తంలో తింటుంటారు. దీని కారణంగా అధిక బరువు సమస్య వెంటాడుతుంది. అలాగే సరిపడ నిద్ర ఉన్నా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. వీటితో పాటు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఫుడ్‌ను జోడించాలని నిపుణులు చెబుతున్నారు..

* అల్లంలో ఉండే జింజిరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వేడి ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గొచ్చు.

* బరువు తగ్గాలనుకునే వారు నిమ్మకాయ రసాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలోని విటమిన్ సి కడుపులో ఆమ్ల స్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

* పొట్ట సమస్య తగ్గాలనుకునే వారు పసుపును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పసుపులోని కర్కుమిన్ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తాగితే ఫలితం ఉంటుంది.

* రోజూ నాలుగు తులసి ఆకులను నమిలినా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. తులసిలో శరీరానికి అవసరమైన యూజినాల్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

* ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీళ్లలో నెయ్యిని కలుపుకొని తీసుకోడం వల్ల పొట్ట సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇందులోని అమైనో ఆమ్లాలు బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..