Fly control: వర్షాకాలంలో ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా.? ఇలా చేయండి..

|

Jul 02, 2024 | 4:13 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు పిలవని అతిథులుగా వచ్చేస్తాయ్‌ ఈగలు. ఈగలు చేసే శబ్ధానికి ఇరిటేషన్‌ రావడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు సైతం ఈగలు కారణమవుతుంటాయి. దీంతో ఇంట్లో ఈగలు రాకుండా ఉండేందుకు మనలో చాలా మంది మార్కెట్లో లభించే రసాయనాలను ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా ఇంట్లో లభించే సహజ...

Fly control: వర్షాకాలంలో ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా.? ఇలా చేయండి..
Fly
Follow us on

వర్షాకాలం వచ్చిందంటే చాలు పిలవని అతిథులుగా వచ్చేస్తాయ్‌ ఈగలు. ఈగలు చేసే శబ్ధానికి ఇరిటేషన్‌ రావడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు సైతం ఈగలు కారణమవుతుంటాయి. దీంతో ఇంట్లో ఈగలు రాకుండా ఉండేందుకు మనలో చాలా మంది మార్కెట్లో లభించే రసాయనాలను ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా ఇంట్లో లభించే సహజ పదార్థాలతోనే ఈగలకు చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ ఆటిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వెనిగర్‌, పాత్రలను శుభ్రం చేసే సబ్బుతో ఈగలకు చెక్‌ పెట్టొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంత ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను తీసుకోవాలి. అనంతరం అందులో ఒక టీస్పూన్‌ చక్కెరను కలపాలి. ఆ తర్వాత అందులో కొంత డిష్‌ సోప్‌ను కలపాలి. ఈ లిక్విడ్‌ను ఈగలు వచ్చే చోట చల్లండి అంతే ఈగలు రావడం తగ్గుతుంది.

* ఈగలు ఎక్కువగా వాలే చోట ఉప్పు, పసుపును కలిపి చల్లాలి. ఇందులో కొంత నీరు మిక్స్‌ చేసి స్ప్రే చేస్తే ఈగలు పరార్‌ అవుతాయి.

* మిరియాలు, ఉప్పు కూడా ఈగలను తరిమికొడతాయి. ఇందుకోసం రెండు కప్పుల నీటిని తీసుకొని బాగా మరిగించాలి. అనంతరం అందులో ఉప్పు, మిరియాల పొడిని వేయాలి. ఇది చల్లపడిన తర్వాత ఒక బాటిల్‌లోకి తీసుకొని ఈగలు, దోమలు వచ్చే చోట స్ప్రే చేయాలి. దీంతో ఈగలు అటువైపు రావు.

* ఈగలను రాకుండా చేయడంలో నారిజం తొక్క కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం నారింజ తొక్కలను ఒక క్లాత్‌లో కట్టి వంట గదిలో వేలాడదీయాలి. ఇలా చేసినా ఈగలు రాకుండా ఉంటాయి.

* కసం కోసిన యాపిల్‌ను తీసుకొని వాటిలో కొన్ని లవంగాలు వేయాలి. అనంతరం ఈగలు ఎక్కువగా వచ్చే ప్రదేశంలో దీనిని పెట్టాలి. ఇలా చేస్తే ఈగలు అటువైపు రావు.

* ఇంట్లో కర్పూరం వెలిగించి గదుల్లో పొగ వ్యాపించేలా చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఈగలు పారిపోతాయి. అలాగే ఒక గ్లాసులో కర్పూరం బిళ్లలను వేసి ఆ నీటిని ఈగలు ఉన్న చోట చల్లాలి దీనివల్ల కూడా ఈగలను తరిమికొట్టొచ్చు.

* తులసి, పుదీనా ఆకులను బాగా గ్రైండ్‌ చేసి పేస్ట్‌లా చేయండి. అనంతరం అందులో కొన్ని నీళ్లు పోసి బాటిల్‌లో తీసుకోండి. దీనిని ఈగలు వచ్చే చోట స్ప్రే చేయండి. ఈగలు అటువైపు రాకుండా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..