Health Tips: వ్యాయామం చేయకుండా బెల్లీఫ్యాట్ కరిగించాలనుకుంటున్నారా..! అయితే ఈ 5 విషయాలపై దృష్టి పెట్టండి..

|

Aug 29, 2021 | 1:23 PM

Health Tips: బరువు తగ్గాలనుకునేవారు బెల్లీఫ్యాట్‌ని కరిగించాల్సి ఉంటుంది కానీ ఇది సులువు కాదు. దీనివల్ల ఊబకాయం, అధిక రక్తపోటు,

Health Tips: వ్యాయామం చేయకుండా బెల్లీఫ్యాట్ కరిగించాలనుకుంటున్నారా..! అయితే ఈ 5 విషయాలపై దృష్టి పెట్టండి..
Weight Loss
Follow us on

Health Tips: బరువు తగ్గాలనుకునేవారు బెల్లీఫ్యాట్‌ని కరిగించాల్సి ఉంటుంది కానీ ఇది సులువు కాదు. దీనివల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే వ్యాయామం చేయకుండా బెల్లీఫ్యాట్ కరిగించాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ 5 విషయాలపై దృష్టి సారించండి.

1. ఆహారంపై శ్రద్ధ పెట్టండి..
మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. దీని కారణంగా బరువు పెరగడం మొదలవుతుంది. మీరు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే కేలరీల సంఖ్యను తగ్గడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటారు. అంతేకాదు బెల్లీ ఫ్యాట్ ఏర్పడదు దీంతో మీరు చాలా కాలం పాటు ఫిట్‌గా ఉంటారు.

2. ఆహారాన్ని నమలండి
మీరు బెల్లీ ఫ్యాట్‌ పెరగకూడదంటే ఆహారాన్ని ఎక్కువగా తినవద్దు. ఎల్లప్పుడూ సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తినండి. అంతేకాదు తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి తినండి. ఇలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

3. తగినంత నిద్ర అవసరం
తగినంత నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు. చాలా అధ్యయనాలు నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరుగుతారని నిర్ధారించాయి. తక్కువ నిద్ర, ఒత్తిడి మీ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. అధిక కేలరీల ఆహారం కోసం కోరికను పెంచడానికి పని చేస్తాయి. అందుకే మీరు రోజూ తగినంతగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం ముఖ్యం.

4. సరైన విధంగా కూర్చొండి..
మీరు వర్క్ చేసేటప్పుడు సరైన విధంగా కూర్చొండి.
ఇష్టమొచ్చిన విధంగా కూర్చొవడం వల్ల అనేక వ్యాధులు సంభవించవచ్చు. బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. మంచి భంగిమ మీ కడుపు కండరాలతో పాటు మీ ప్రేగులకు కూడా మంచిది. ఇది వెన్నెముక ఎముకలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

5. తగినంత నీరు తీసుకోండి
మన శరీరానికి నీరు చాలా ముఖ్యం. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా ఆకలిని వేయకుండా చూస్తుంది. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. మీరు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో మూలికా టీ లేదా నిమ్మరసం తాగవచ్చు.

Telangana Schools: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి మోగనున్న స్కూల్ బెల్స్.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితిపై ఓవర్ వ్యూ

Vishal: విశాల్ 31 సినిమా టైటిల్ ప్రకటన.. త్వరలో ‘సామాన్యుడి’గా ప్రేక్షకుల ముందుకు..

Vizianagaram: హాస్టల్ గదిలో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య.. తెల్లారితే ఇంటికి వెళ్లాలనగా