Fitness Tips: జిమ్‌కు వెళ్తున్నారా..? రెగ్యులర్‌గా ఈ డ్రింక్ తాగితే బోలెడన్ని ప్రయోజనాలు..

|

Aug 30, 2022 | 9:15 PM

జిమ్ తర్వాత డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. తద్వారా జిమ్ సమయంలో కోల్పోయిన మినరల్స్ మొత్తం శరీరంలో భర్తీఅవుతుంది.

Fitness Tips: జిమ్‌కు వెళ్తున్నారా..? రెగ్యులర్‌గా ఈ డ్రింక్ తాగితే బోలెడన్ని ప్రయోజనాలు..
Health Tips
Follow us on

Coconut Water Benefits: చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్తుంటారు. జిమ్ తర్వాత డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. తద్వారా జిమ్ సమయంలో కోల్పోయిన మినరల్స్ మొత్తం శరీరంలో భర్తీఅవుతుంది. అదే సమయంలో చాలా పానీయాలలో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అలాంటి ఓ అద్భుతమైన పానీయం గురించి మీకు చెప్పనున్నాం.. జిమ్ తర్వాత కొబ్బరి నీరు తీసుకోవడం ద్వారా శరీర శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలో కేలరీలను పెంచదు. కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఎలక్ట్రోలైట్స్ పరిమాణం పెరుగుతుంది: కొబ్బరి నీళ్లలో 5 రకాల ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. మరోవైపు, కొబ్బరి నీరు విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. దీన్ని తీసుకోవడం వల్ల వర్కవుట్ అయ్యాక కండరాల్లో వచ్చే తిమ్మిర్లు దూరమవుతాయి. కావున జిమ్ తర్వాత రోజూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి

శక్తి లభిస్తుంది : కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు.

ఆకలిని తగ్గిస్తుంది : అధిక బరువు ఉన్నవారు తరచుగా అతిగా తినే సమస్యను ఎదుర్కొంటారు. వర్కవుట్ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకుంటే, చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయం చేస్తుంది.

కేలరీలు పెరగవు: జిమ్ తర్వాత, స్పోర్ట్స్ తర్వాత డ్రింక్‌ని తీసుకోవాలనుకుంటే.. కొబ్బరి నీరు చాలా మంచిది. దీనివల్ల ఎలాంటి క్యాలరీలు పెరగవు, ఇంకా ఫిట్‌గా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం