
మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ మనం ఎంతకాలం జీవించగలమో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. కానీ మనం ఎంతకాలం జీవించగలమని ఎవరినైనా అడిగినప్పుడు సాధారణంగా చెప్పే కామన్ ఆన్సర్ ఏంటంటే.. జీవితం, మరణం రెండూ ఆ దేవుని చేతుల్లోనే ఉన్నాయని చెబుతుంటాం. కానీ జీవితానికి, మరణానికి మధ్య సంబంధం మీ గోళ్లలోనే ఉందనే విషయం మీకు తెలుసా? అవును.. మనం ఎంతకాలం జీవించగలమో మన గోర్లు చూసి ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ షాకింగ్ విషయాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుడు డేవిడ్ సింక్లైర్ వెల్లడించారు.
గోళ్ల పెరుగుదల ఆధారంగా, ఒక వ్యక్తి మరణం నిర్ణయించబడుతుందని వీరి అధ్యయనంలో తేలింది. ఒక వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడు, అతని జీవితకాలం ఎంత అనే ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం ఉండదు. కానీ దీనికి సమాధానం ఇప్పుడు జన్యు శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ సింక్లైర్ కనుగొన్నారు. ఒక అధ్యయనం ప్రకారం గోళ్ల ఆరోగ్యం, వాటి పెరుగుదల ఒక వ్యక్తి జీవితకాలం నిర్ణయిస్తుందని, అతను ఎప్పుడు చనిపోతాడో కూడా చెబుతుందని ఆయన చెబుతున్నారు.
డాక్టర్ డేవిడ్ సింక్లెయిర్ ప్రకారం.. మీ గోళ్ల ఆరోగ్యం శరీరంలో కొత్త కణాలు ఏర్పడే వేగాన్ని ప్రతిబింబిస్తుంది. అతని పరిశోధన ప్రకారం.. మీ గోళ్లు వేగంగా పెరుగుతున్నట్లయితే, మీకు నెమ్మదిగా వృద్ధాప్యం వస్తుందని చెప్పవచ్చు. అంటే మీరు ఎక్కువ కాలం జీవిస్తారు. కాబట్టి గోళ్ల పెరుగుదలను సరిగ్గా పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఈ విధంగా మీరు ఎంత కాలం జీవిస్తారో తెలుసుకోవచ్చు.
డాక్టర్ డేవిడ్ సింక్లెయిర్ ప్రకారం.. గోర్లు నెమ్మదిగా పెరిగే వారు త్వరగా చనిపోతారు. ఆ వ్యక్తుల వయస్సు సాపేక్షంగా తగ్గుతుందని ఆయన అన్నారు. నిజానికి, గోళ్ల పెరుగుదల ఒక వ్యక్తి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గోళ్లను చూసి ఒంట్లోని రోగాలను కూడా గుర్తించవచ్చు. అందువల్ల గోర్ల ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టడం అవసరం. గోర్లు పెరుగుదలను బట్టి మీ వయస్సు, ఆయుష్షు నిర్ధారణ అవుతాయి.