ముఖం, గెడ్డం, మెడ చుట్టూ కొవ్వు పేరుకుందా.. ఈ యోగాసనాలు ట్రై చేసి చూడండి

|

May 03, 2024 | 11:17 AM

శరీరం సన్నబడినా ముఖం, గడ్డం, మెడ చుట్టూ పేరుకున్న కొవ్వు మాత్రం తగ్గదు. సరికదా ముఖతీరులో మార్పు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో ముఖం, మెడ కొవ్వును తగ్గించుకోవడానికి రోజూ కొన్ని రకాల యోగాసనాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనాలు ముఖం, మెడపై కొవ్వు తగ్గడమే కాదు కండరాలను టోన్ చేస్తుంది. ముఖంలో మెరుపుని పెంచుతుంది. ముఖంపై డబుల్ చిన్ లేదా అధిక కొవ్వు పేర్కొంటే చిన్న వయస్సులోనే వృద్ధాప్యం వచ్చినట్లు కనిపిస్తుంది. గ్లోయింగ్, టోన్డ్ స్కిన్ పొందడానికి, ఫిట్‌నెస్ రొటీన్‌లో కొన్ని యోగా భంగిమలను చేర్చుకోవాలి.

ముఖం, గెడ్డం, మెడ చుట్టూ కొవ్వు పేరుకుందా.. ఈ యోగాసనాలు ట్రై చేసి చూడండి
Yoga Pose Benefits
Image Credit source: getty image
Follow us on

శరీరం బరువు పెరగడంతో శారీరక ఆకృతిలో కూడా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ముఖం, గడ్డం మీద కొవ్వు పేరుకుని రూపురేఖలు మారిపోయి పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. అయితే శరీరం బరువు తగ్గించుకునే ప్రయత్నాలలో శరీరం సన్నబడినా ముఖం, గడ్డం, మెడ చుట్టూ పేరుకున్న కొవ్వు మాత్రం తగ్గదు. సరికదా ముఖతీరులో మార్పు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో ముఖం, మెడ కొవ్వును తగ్గించుకోవడానికి రోజూ కొన్ని రకాల యోగాసనాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనాలు ముఖం, మెడపై కొవ్వు తగ్గడమే కాదు కండరాలను టోన్ చేస్తుంది. ముఖంలో మెరుపుని పెంచుతుంది.

ముఖంపై డబుల్ చిన్ లేదా అధిక కొవ్వు పేర్కొంటే చిన్న వయస్సులోనే వృద్ధాప్యం వచ్చినట్లు కనిపిస్తుంది. గ్లోయింగ్, టోన్డ్ స్కిన్ పొందడానికి, ఫిట్‌నెస్ రొటీన్‌లో కొన్ని యోగా భంగిమలను చేర్చుకోవాలి. ఈ యోగాసనాలు చర్మంతో పాటు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

భుజంగాసనం అంటే కోబ్రా పోజ్: ప్రతిరోజూ భుజంగాసనం చేస్తే అది మీ వెన్నెముక, భుజాల ఎముకలను బలోపేతం చేయడమే కాదు గుండె, ఊపిరితిత్తులకు కూడా మేలు చేస్తుంది. అంతేకాదు భుజంగాసనం చేసే సమయంలో ముఖాన్ని ఎత్తినప్పుడు, మెడ కండరాలు సాగదీయబడతాయి. ఇది మెడ ప్రాంతంలో పెరిగిన కొవ్వును తగ్గించడంలో, డబుల్ గడ్డం తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

లియో భంగిమ లేదా సింహాసన యోగా: ఈ యోగాసనంలో ముందుగా వజ్రాసనంలో కూర్చుని (కాళ్లను మోకాళ్ల వెనుకకు వంచి) రెండు కాళ్ల మధ్య దూరం చేసి అదే దూరంలో చేతులను నేలపై ఆనించాలి. దీని తరువాత, సింహంలా గర్జిస్తున్నట్లుగా భంగిమలో ఉంచండి. ఈ యోగాసనాన్ని రోజూ చేయడం ద్వారా ముఖం, మెడపై అదనపు కొవ్వును తొలగించుకోవచ్చు.

ఉష్ట్రాసనం : ముఖం, మెడపై పెరిగిన కొవ్వును తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ఉష్ట్రాసనం చేయవచ్చు. ఇది డబుల్ చిన్‌ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా ముఖంపై అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఈ ఆసనం ముఖం వైపు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతేకాదు ఉష్ట్రాసనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, నడుము నొప్పి నుంచి ఉపశమనం, రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మత్స్యసనం: ముఖ కొవ్వును తగ్గించడానికి, టోన్, గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఫిష్ పోజ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా బెలూన్ పోజ్ (నోటిలో గాలి నింపి వదులడం) చేయాలి. అదే సమయంలో ముఖం, మెడపై వేళ్ల సహాయంతో కొంత సమయం పాటు నొక్కడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇలా చేయడం వలన చర్మం మెరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..