మన భారతీయ సంప్రదాయంలో వాస్తు శాస్త్రంకి ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. వాస్తు ప్రకారం చేసిన ఇంటి నిర్మాణం శుభశక్తులు, ఆరోగ్యం, సంపద, శాంతిని అందిస్తుంది. దీనిని పాటించడం వల్ల కుటుంబం సౌఖ్యంగా, ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా వాస్తు నియమాలను పాటించడం ద్వారా జీవనశైలిలో శ్రేయస్సు పెరుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడూ తెలుసుకుందాం.
ఇంటికి మెయిన్ ఎంట్రెన్స్ చాలా కీలకమైనది. వాస్తు ప్రకారం, మెయిన్ ఎంట్రెన్స్ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండటం శుభప్రదం. తూర్పు ఎంట్రెన్స్ ద్వారా సూర్య కిరణాలు ఇంట్లోకి ప్రవేశించి శక్తిని పెంచుతాయి. దాని శుభ్రతను కాపాడటం, దీపాలు వెలిగించడం మరింత శ్రేయస్సునిస్తుంది. ఇక డైనింగ్ హాల్ విషయానికి వస్తే.. పశ్చిమ లేదా దక్షిణ దిశలో ఉండటం అనుకూలం. భోజనం చేసే సమయంలో తూర్పు వైపు ముఖం ఉంచడం శ్రేయస్కరం. అలాగే, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కిచెన్ కి వాస్తు నియమాలలో ప్రత్యేకమైన స్థానం కలిగుంది. కిచెన్ దక్షిణ తూర్పు (అగ్ని మూల) దిశలో ఉండాలి. వంట చేసేటప్పుడు తూర్పు వైపుకు ముఖం ఉండటం శ్రేయస్కరమని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. కిచెన్ లో నీటి నిల్వలు, సింక్ వంటి వాటిని ఈశాన్య దిశలో ఉంచడం ఉత్తమం. దీని వల్ల ఇంట్లో శుభశక్తులు ఉండి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభ్రతతో పాటు అనుకూల వాతావరణం కల్పించడం అవసరం.
పూజా గది ఈశాన్య దిశలో ఉండటం శ్రేయస్కరం. దేవతా విగ్రహాలను తూర్పు లేదా ఉత్తర వైపున ఉంచి ప్రతిరోజూ దీపం, ధూపం వెలిగించడం శుభప్రదంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక శ్రేయస్సును, ఇంటి శాంతిని పెంచుతుంది.
బెడ్ రూమ్ దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉండాలి. పడుకునేటప్పుడు తల దక్షిణ దిశ వైపు ఉంచడం ఉత్తమం. ఇది ప్రశాంతత, విశ్రాంతిని కలిగిస్తుంది. గదిని శుభ్రంగా ఉంచడం, సరైన శక్తులను పెంచడంలో కీలకమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటిలో గాలి, వెలుతురు సరఫరా కోసం తూర్పు, ఉత్తర దిశల్లో కిటికీలు ఉండాలి. ఇవి శుభశక్తులను ఆకర్షిస్తాయి. పశ్చిమ, దక్షిణ దిశల్లో కిటికీల సంఖ్య తగ్గించడం మంచిదని వాస్తు చెబుతుంది. ఇంట్లో నీటి నిల్వలను ఉత్తర, తూర్పు, ఈశాన్య దిశలో ఉంచడం శ్రేయస్కరం. మధ్య భాగంలో లేదా పశ్చిమ దిశలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. దీని వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుది.
వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, శాంతి, ఆనందం లభిస్తాయని ఆధ్మాత్మిక నిపుణులు చెబుతున్నారు. ప్రకృతితో సమతుల్యంగా ఇంటిని నిర్మించడం జీవనశైలిని మెరుగుపరుస్తుంది. వాస్తు పద్ధతులు శ్రేయస్సు, విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో శ్రద్ధగా వాస్తు నియమాలను పాటించడం వల్ల శుభశక్తులు నిలయమవుతాయట.