Cooking Tips:కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా.. తోడులేకుండా పెరుగు రెడీ కావాలా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి

|

Jun 15, 2021 | 11:21 AM

Cooking Tips: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్లు. అందరికీ ఒకేలాంటి ఇష్టాలు.. హాబీలు ఉండవు. కొంతమందికి మొక్కలు పెంచడం ఇష్టమైతే.. మరికొందరికి బుక్స్ చదవడం, సంగీతం వినడం ,..

Cooking Tips:కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా.. తోడులేకుండా పెరుగు రెడీ కావాలా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
Home Tips
Follow us on

Cooking Tips: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్లు. అందరికీ ఒకేలాంటి ఇష్టాలు.. హాబీలు ఉండవు. కొంతమందికి మొక్కలు పెంచడం ఇష్టమైతే.. మరికొందరికి బుక్స్ చదవడం, సంగీతం వినడం , కుట్లు అల్లికలు ఇలా అనేక అభిరుచులుంటాయి. అయితే చాలామందికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ప్రస్తుత బిజీ లైఫ్ లో ఏ మాత్రం సమయంలో దొరికినా వంట ఇంట్లోకి వెళ్లి రకరకాల పదార్ధాలను వండుతూ ప్రయోగాలు చేస్తారు. అయితే కొన్ని అనుకున్నట్లు వండలేరు.. కూరల్లో ఉప్పు, కారం ఎక్కువ కావడం.. కొన్నింటిలో పులుపు ఎక్కువ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. ఈ అద్భుతమైన టిప్స్ పరిష్కారం చూపించడమే కాదు.. వంటకానికి చక్కని రుచి వచ్చేసేలా చేసి అందరినీ మెప్పిస్తాయి కూడా..

* కూరలో ఉప్పు ఎక్కువైతే..
ఎంతో ఇష్టంగా కష్టపడి వండిన కూర లో ఉప్పో, కారమో తక్కువైతే పర్వాలేదు.. మళ్ళీ వేసుకోవచ్చు అదే ఎక్కువ అయితే మాత్రం తినలేం. అలా ఉప్పు, కారం ఎక్కువైన కూరలకు టేస్టీ కోసం ఓ చిట్కా ఉంది. కూరలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు లేదా చపాతీ తయారుచేయడానికి సిద్ధం చేసిన పిండి ముద్దలు అందులో వేసి కాసేపు ఉంచేయాలి. ఇవి ఉప్పును పీల్చేసుకుంటాయి కాబట్టి కూరలో ఉప్పు తగ్గుతుంది. ఆ తర్వాత కూర వడ్డించేటప్పుడు వీటిని తీసేస్తే సరిపోతుంది.

మరి ఉప్పు కారం వేపుడు చేసిన పదార్ధాల్లో ఎక్కువైతే.. కొంచెం శనగపిండిని నీళ్లలో కలిపి అందులో పోస్తే ఉప్పు తగ్గుతుంది.

* అన్నం పొడిగా రావాలంటే..
సాధారణంగా అన్నం ప్రతి మెతుకు పొడిపొడిగా అంటుకోకుండా ఉండడం చాలామందికి ఇష్టం. అలా అన్నం రావాలంటే.. అన్నం వండేటప్పుడు అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేయండి. దీంతో అన్నం మెతుకులు అతుక్కోకుండా వస్తాయి.

* తోడు లేకపోయినా పెరుగు కావాలంటే..
ఇంట్లో పెరుగు తోడు లేకపోతే పక్కవారిని అడిగి అప్పుడు తోడుపెడతాం. అయితే తోడు లేకపోయినా పాలును కమ్మటి పెరుగుగా మార్చుకోవచ్చు. ఎలాగంటే.. పాలను గోరువెచ్చగా చేసి అందులో రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి.. పన్నెండు గంటలు అస్సలు కదపకుండా పక్కన పెట్టాలి. మంచి గడ్డపెరుగు రెడీ అవుతుంది.

*టీ పొడిని పడేయకండి..
వాడేసిన తర్వాత తీసిపోడితో అద్దాలు, చెక్కతో చేసిన వస్తువులు శుభ్రం చేయడం వల్ల అవి మెరుస్తాయి.

* డ్రై ఫ్రూట్స్ నిల్వ చేసే విధానం :
డ్రై ఫ్రూట్స్ ఎక్కువ రోజులు నినిల్వ చేస్తే.. వాటికి పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఈ డ్రై గాలితగలని విధంగా భద్రపరచాలి. ఎప్పడు వీటికి తడి తగలనీయకూడదు.

* పెరుగు పచ్చడి
బిర్యానీలోకి పెరుగు పచ్చడి తప్పనిసరి. మనం తినే సమయానికి కొన్ని గంటల ముందే రైతా తయారుచేసి పెట్టేస్తాం. దీని వల్ల రైతా పుల్లగా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా పెరుగులో కూరగాయలు.. మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. కానీ ఉప్పు మాత్రం వేయకూడదు. దాన్ని సర్వ్ చేసే ముందు మాత్రమే ఉప్పు వేయడం వల్ల రైతా పులుపు అవ్వదు.

*అల్లం పేస్ట్‌ నిల్వ
*అల్లం పేస్ట్‌ నిల్వ చేసుకోవాలంటే.. చెంచా ఆవాల నూనె వేయాలి. ఇలా చేయడం వల్ల అల్లం పేస్ట్ పాడవకుండా ఉంటుంది.

*గుడ్లు పగలకుండా..
గుడ్లు ఉడకబెట్టినప్పుడు పగిలిపోతుంటే ఈ చిట్కా పాటించండి. గుడ్లను ఉడకబెట్టే నీటిలో ముందు అర చెంచా ఉప్పు వేయండి. ఆ తర్వాత గుడ్లు నెమ్మదిగా అందులో వేసి ఉడికించండి. ఇలా చేస్తే అవి పగలకుండా బాగా ఉడుకుతాయి.

*మాడిపోయిన గిన్నెలు శుభ్రం..
వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోవడం సహజం. వీటి మాడును తొలగించేందుకు ఇందులో కాస్త టీ పొడి, నీళ్లు పోసి కొంచెం సేపు పక్కన పెట్టి.. ఆ తర్వాత శుభ్రం చేస్తే గిన్నెలు మెరుస్తాయి.

Also Read: మట్టిగాజులు ధరించడం వలన మహిళలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..