శీతాకాలం మొదలైంది. మారుతున్న వాతావరణం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్‌లో చర్మం చాలా పొడిగా.. పొడిగా మారుతుంది. ఈ సీజన్‌లో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఈ పొడి గాలి మన చర్మం నుంచి తేమను లాగేస్తుంది. ఈ సీజన్‌లో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, చలికాలపు బ్రేక్‌అవుట్‌లలో, చర్మంపై దీర్ఘకాలిక పొడి, ప్యాచ్‌లు కనిపిస్తాయి. చలికాలంలో వేడి నీటిని వాడటం వల్ల చర్మ సమస్య పెరుగుతుంది. శీతాకాలం వచ్చింది. మారుతున్న వాతావరణం చర్మంపై తన ప్రభావాన్ని చూపడం మొదలు పెడుతుంది. ఈ సీజన్ కోసం చర్మాన్ని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం.
శీతాకాలంలో వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి. చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం చాలా హాయిగా అనిపించినా.. చర్మాన్ని చాలా రకాలుగా డ్యామేజ్ చేస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. స్నానానికి ముందు చర్మానికి కొద్దిగా నూనె రాయండి. ఎందుకంటే ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. కాకపోతే చర్మంపై వేడి నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీని అర్థం సన్‌స్క్రీన్ ఉపయోగించకూడదని కాదు. సూర్యుని హానికరమైన UV-కిరణాలు శీతాకాలంలో మేఘాల గుండా చొచ్చుకువస్తాయి. మీ చర్మాన్ని సులభంగా డ్యామెజ్ చేస్తాయి. అందుకే చలికాలంలో చర్మ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి టీ, కాఫీ, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం, దీని వల్ల శరీరంలో పోషకాల కొరత ఏర్పడి శరీరంలో నీటి కొరత కూడా ఏర్పడుతుంది. ఈ సీజన్‌లో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా రక్త ప్రసరణ సజావుగా సాగి చర్మ మరమ్మతులు కూడా జరుగుతాయి.
చలికాలంలో పొడిబారడం వల్ల చర్మం చాలా నష్టపోతుంది. ఈ సీజన్‌లో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం వల్ల దీర్ఘకాలిక పొడిబారకుండా నిరోధించవచ్చు. మాయిశ్చరైజ్ చర్మానికి హానిని నివారిస్తుంది. మీ చర్మానికి అనుగుణంగా మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. చలికాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం