AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips For Face : అందమైన మెరిసే ముఖం కోసం బామ్మ చెప్పిన సహజమైన చిట్కాలు ఏమిటో తెలుసా..!

వయసు తో సంబంధం లేకుండా అందంగా కనిపించాలని అనుకుంటారు. ముఖ్యంగా తమ చర్మం మంచి వర్చస్సుతో నిగనిగలాడుతూ ఉండాలని భావిస్తారు.. అందుకనే ఎక్కువగా మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన...

Beauty Tips For Face : అందమైన మెరిసే ముఖం కోసం బామ్మ చెప్పిన సహజమైన చిట్కాలు ఏమిటో తెలుసా..!
Surya Kala
|

Updated on: Mar 10, 2021 | 1:28 PM

Share

Beauty Tips For Face : వయసు తో సంబంధం లేకుండా అందంగా కనిపించాలని అనుకుంటారు. ముఖ్యంగా తమ చర్మం మంచి వర్చస్సుతో నిగనిగలాడుతూ ఉండాలని భావిస్తారు.. అందుకనే ఎక్కువగా మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన అనేక లోషన్లను వాడుతూనే ఉంటారు.. అయితే కాలాను గుణంగా మన చర్మం తీరు మారుతుంది. కనుక ఇంట్లో దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. మిలమిలా మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు..

ముఖానికి సహజమైన క్లినర్ గా పచ్చి పాలు పనిచేస్తాయి. రోజు పచ్చిపాలను దూది లో ముంచుకుని ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. మెరుపుని సంతరించుకుంటుంది. ముఖానికి ఏ కాలంలోనైనా మెరుపునిచ్చేది తేనే. రోజుకి రెండు సార్లు తేనే ను ముఖానికి అప్లై చేస్తే కొన్ని రోజుల్లోనే మంచి మెరుపు వస్తుంది. అయితే ఈ తేనే ను ఉడకబెట్టిన క్యారెట్ కు కలిపి రాసుకుంటే మరింత త్వరగా మేని మెరుపుని సంతరించుకుంటుంది. ఎండకు చర్మంపై టాన్ ఎక్కువనప్పుడు నిగనిగలాడే చర్మం కోసం నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచ్ లక్షణాలుంటాయి. వీటివలన ముఖంపై పేరుకున్న జిడ్డుని తొలగించి నిగనిగలాడేలా చేస్తుంది. రోజు నిమ్మరసాన్ని ముఖాన్ని అప్లై చేయాలి.. అయితే ఈ నిమ్మరసాన్ని చక్కర కలిపి రాస్తే ఇంకా త్వరగా మంచి ఫలితాన్ని పొందవచ్చు. చాలా మందిని ఇబ్బంది పెట్టె సమస్య ముఖంపై బ్లాక్ హెడ్స్. వీటికి సహజనివారిని కీరదోసకాయ. కీరదోసకాయను సన్నని స్లైస్ గా కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి .. కొన్ని నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి .. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది. ముఖానికి సహజమైన మెరుపు సంతరించుకోవాలంటే.. తులసి ఆకులు దివ్య ఔషధం.. వాటిని ఎండబెట్టి పొడి చేసి.. తర్వాత రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి అప్లై చేయాలి.. ఆరిపోయిన తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేయాలి.. ఇలా ఒకవారం పది రోజుల పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది. అయితే ఏ మహిళ అయినా వయసుతో సంబంధం లేకుండా నిగనిగలాడే చర్మం కోరుకుంటుంది, అయితే ఎన్ని సహజమైన పద్ధతులు పాటించినా.. లేక క్రీమ్స్ వాడినా సౌందర్యవంతమైన చర్మం సొంతం కావాలనుంటే.. మంచి పోషకమైన ఆహారం తీసుకోవాలి. తినే ఆహారంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు మరియు పండ్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి.. తగినంత నిద్రపోవాలి

Also Read:

 వాహనాల తనిఖీ సమయంలో పోలీసులతో ఓ యువతి వాగ్వాదం.. చేయి చేసుకున్న మహిళా పోలీసు

ఓటు వేసిన గవర్నర్‌ దంపతులు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఎంత అంటే..