Natarajasana: ప్రస్తుతం మనిషి జీవితం బిజిబిజీ. ఒత్తిడి కూడా అధికమే.. అయితే ఈ ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇచ్చేది వ్యాయామం.. రోజూ పొద్దున్నే కొంచెం సేపు ధ్యానం, యోగాలకు కేటాయిస్తే.. అప్పుడు ఉండే ఉత్సాహమే వేరు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ బయటకు వెళ్లి వ్యాయామం చేయలేని వారు.. ఇంట్లో యోగాసనాలు వేసినా ఫలితం ఉంటుంది.. అటువంటి వారికోసం కొన్ని యోగాసనాలను ఇప్పటికే పరిచయం చేసాం.. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త ఆసనం గురించి తెలుసుకుందాం..! ఈ ఆసనం చేయడానికి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఈరోజు నటరాజసనం గురించి తెలుసుకుందాం..!
నటరాజాసనం అంటే శివతాండవ భంగిమలో ఉండే ఆసనం, ఇక నీకు విశ్వవిజయ ఆనంద శివతాండవమే అంటూ పరమేశ్వరుడి నాట్యస్థితిని తెలియజేసే ఆసనం ఇది. అందుకనే దీనికి నటరాజాసనం అని పేరు వచ్చింది.
1. ముందుగా నిటారుగా నిలబడాలి
2. ఊపిరి తీసుకుంటూ కుడి కాలిని వెనక్కి వంచి కుడి మడమని కుడి చేత్తో పట్టుకోవాలి
3. మీ కుడి కాలిని ఎంత పైకి లేపగలిగితే అంత పైకి లేపాలి
4. ఎడమ చేతిని ముందుకు చాచాలి. (అవసరమైతే ఇంకొకరి సహాయం తీసుకోవచ్చు).
5. మామూలుగా శ్వాస తీసుకుంటూ ఇలా ఇరవై ముప్ఫై సెకన్లు ఉండాలి
6. నెమ్మదిగా మామూలు పొజిషన్ లోకి రావాలి
7. ఇలాగే మరల ఎడమ కాలితో కూడా చెయ్యాలి
8. ఇలా రెండు మూడు నిమిషాల పాటూ చేయడం ఉత్తమం.
ఈ ఆసనం వేయడం వలన మోకాళ్లకు, చేతులకు శక్తి వృద్ధి చెందుతుంది. శ
రీర అవయవాలకి మంచి బలం కలుగుతుంది.
నడుముకు మంచి వ్యాయామం కలిగి సన్నబడుతుంది.
Also Read: ఎండాకాలంలో డీ-హైడ్రేట్ కాకుండా ఉండాలంటే.? ఈ ఐదు పండ్లు తినడం తప్పనిసరి.!