Lifestyle: మొబైల్ ఫోన్ ఇలా వినియోగిస్తున్నారా.. మీరు డెంజర్ జోన్‌లో ఉన్నట్లే..

|

Nov 19, 2021 | 6:32 PM

నేటి కాలంలో ఆధునిక జీవితాన్ని ప్రభావితం చేసిన కమ్యూనికేషన్ మునుపటి కంటే మెరుగైన అభివృద్ధి అందుకుంటోంది. ప్రతి ఒక్కరూ..

Lifestyle: మొబైల్ ఫోన్ ఇలా వినియోగిస్తున్నారా.. మీరు డెంజర్ జోన్‌లో ఉన్నట్లే..
Mobile Phones
Follow us on

Mobile Phones – Lifestyle: నేటి ఉరుకులు పరుగుల జీవితంలో (రన్ ఆఫ్ ది మిల్ లైఫ్) ప్రతి ఒక్కరూ బిజీగా మారారు. నేటి కాలంలో ఆధునిక జీవితాన్ని ప్రభావితం చేసిన కమ్యూనికేషన్ మునుపటి కంటే మెరుగైన అభివృద్ధి అందుకుంటోంది. ప్రతి ఒక్కరూ కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ లేకుండా జీవించలేరు. అయితే వీటి వినియోగమే ఇప్పుడు అసలు సమస్యగా మారుతోంది. అభివృద్ధిని కాసేపు పక్కన పెడినతే ఆరోగ్యం మాత్రం చెడిపోతోందని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. ప్రజలు మొబైల్స్ వాడుతున్న తీరు వల్ల అనేక రకాల శారీరక సమస్యలు వస్తున్నాయి. మొబైల్ వాడకం మానసిక సమస్యలనే కాదు చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం నీలి కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. రెటీనా సమస్యలతో సహా కొత్త వ్యాధిలను తెచ్చిపెడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మొబైల్ వాడకం చర్మ సమస్యలకు కూడా కారణమవుతుందని మీకు తెలుసా..

చర్మ సమస్యలు

మొబైల్ ఫోన్ల వినియోగంతో చర్మంపై రేడియేషన్ ప్రభావం పడుతోంది. అయితే, మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం .. ఎక్కువసేపు కాల్స్ మాట్లాడటం వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రభావాల గురుంచిన ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలియడం లేదని అంటున్నారు.  

కళ్ళు చుట్టూ..

మీరు మొబైల్‌ని ఎక్కువగా వాడుతున్నట్లయితే కళ్ళు చుట్టూ ఉన్న చర్మాన్ని మనం క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి. దీని కోసం మీరు కంటి క్రీమ్ ఉపయోగించడం అవసరం. వేడి, రేడియేషన్, బ్లూ కాంతితో చర్మంపై హైపర్పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ లేదా ప్యాచ్‌లు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో చర్మ సంరక్షణ కోసం  హెడ్ ఫోన్లను ఉపయోగించండి.

చర్మంపై నల్లటి మచ్చలు

మీ చర్మంపై నల్లటి మచ్చలు ఉంటే.. దాని కోసం స్కిన్ సీరమ్‌తో చర్మాన్ని రక్షించండి. సీరమ్‌లోని కొన్ని చుక్కలను తీసుకొని చర్మంపై అప్లై చేయండి. ఇది మీ ముఖ చర్మాన్ని బిగుతుగా , ముడతల నుండి దూరంగా ఉంచుతుంది.సెల్ ఫోన్‌లు కూడా మొటిమలను కలిగిస్తాయి . మొటిమల పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. నిజానికి సెల్‌ఫోన్‌లలో చాలా బ్యాక్టీరియా ఉండవచ్చు.

మీ జుట్టు, చర్మంపై కూడా..

మొబైల్ వాడక ప్రభావం మీ జుట్టు, చర్మంపై కూడా ఉంటుంది. వెంట్రుకల నుండి వచ్చే సెబమ్ ఫేషియల్ ఆయిల్‌ని పెంచుతుంది. ఇది బ్లాక్‌హెడ్స్ , మొటిమలకు కూడా దారి తీస్తుంది. జిడ్డు లేదా మొటిమల బారిన పడే చర్మం కోసం  ఆస్ట్రింజెంట్ లోషన్, కాటన్‌తో తుడవడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తగ్గుతుంది. దీనితో పాటు బ్లూ లైట్ ప్రభావం మీలో వృద్ధాప్య సంకేతాలకు కారణంగా మారుతోంది.. మీ చర్మాన్ని నిర్జీవం చేస్తుంది. మీరు ఎక్కువ సమయంలో ఫోన్‌లో మాట్లాడాల్సి వస్తే “హ్యాండ్స్-ఫ్రీ” పరికరాన్ని ఉపయోగించండి. 

ఇవి కూడా చదవండి: Skin Care Tips: చలికాలంలో డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా.. అద్భుమైన చిట్కా మీకోసం.. ఇంట్లోనే చేసుకోండిలా..

MLA Roja: నాకు చాలా సంతోషంగా ఉంది.. బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో