40 దాటిన స్త్రీలు ఫిట్ గా ఉండాలంటే ఈ ఆసనం ట్రై చేసి చూడండి .. ప్రయోజనాలు ఎన్నో..

|

Apr 16, 2024 | 3:19 PM

ఈరోజు స్త్రీలను ఫిట్ గా ఉంచే ఒక ఆసనానికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కరీనా కపూర్ షేర్ చేశారు. ఇద్దరి పిల్లల తల్లి.. 43 ఏళ్ల కరీనా కపూర్ చాలా ఫిట్‌గా కనిపిస్తోంది. కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె చక్రాసనం చేస్తూ కనిపించింది. ఈ రోజు చక్రాసనం వలన కలిగే ప్రయోజనాలు, అభ్యసించడానికి సరైన పద్దతిని గురించి తెలుసుకుందాం..    

40 దాటిన స్త్రీలు ఫిట్ గా ఉండాలంటే ఈ ఆసనం ట్రై చేసి చూడండి .. ప్రయోజనాలు ఎన్నో..
Chakrasanam
Image Credit source: Image Credit source: insta/kareenakapoorkhan
Follow us on

యోగా శరీరం ఫిట్ గా ఉంచుకోవడానికి మాత్రమే కాదు.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. యోగాసనాలు వేయడానికి స్త్రీ, పురుషులనే బేధం లేదు. యోగసనాలను వేయడానికి వయో పరిమితి లేదు. ఈరోజు స్త్రీలను ఫిట్ గా ఉంచే ఒక ఆసనానికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కరీనా కపూర్ షేర్ చేశారు. ఇద్దరి పిల్లల తల్లి.. 43 ఏళ్ల కరీనా కపూర్ చాలా ఫిట్‌గా కనిపిస్తోంది. కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె చక్రాసనం చేస్తూ కనిపించింది. ఈ రోజు చక్రాసనం వలన కలిగే ప్రయోజనాలు, అభ్యసించడానికి సరైన పద్దతిని గురించి తెలుసుకుందాం..

చక్రాసనం వల్ల కొవ్వు తగ్గుతుంది

చక్రాసనం చక్రం ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది. ఈ యోగా ఆసనం దిగువ శరీరం కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఆసనం చేయడం వల్ల ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు.

శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది

ప్రతిరోజూ ఈ ఆసనాన్ని చేస్తే, ఇది వెనుక భాగంలో వశ్యతను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే, ఈ ఆసనం కండరాలను మెరుగుపరచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, వెన్నునొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. అయితే ఇప్పటికే వెన్ను లేదా మెడ నొప్పి ఉంటే, ఈ ఆసనం చేసే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాల్సిందే..

ఇవి కూడా చదవండి

జీర్ణశక్తి బలంగా ఉంటుంది

ఈ యోగాసనాన్ని చేయడం వల్ల జీర్ణశక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఎసిడిటీ సమస్య నుంచి దూరంగా ఉంచుతుంది. అయితే రోజూ ఈ యోగాసనాన్ని సాధన చేయాలి.

చక్రాసనం చేయడానికి సరైన మార్గం

ఈ యోగా ఆసనం చేయడానికి ముందుగా యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకోండి.

తర్వాత రెండు కాళ్లను వంచి మడమలను తుంటి దగ్గరికి తీసుకుని మోకాళ్లను నిటారుగా చేయాలి.

తరువాత చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. ఈ సమయంలో మెడ కిందికి వేలాడుతుండాలి.

ఇప్పుడు శరీరాన్ని వదులుగా ఉంచండి.. దీర్ఘంగా శ్వాస తీసుకోండి.

కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును నిటారుగా ఆనించాలి.

10 సెకన్ల పాటు ఈ ఆసనం చేసిన తర్వాత మళ్లీ శరీరాన్ని క్రిందికి దించి వెనుకకు పడుకోవాలి. దీని తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.

 ఆసనం వేసే సమయంలో తీసుకోవాలిన జాగ్రత్తలు

నిపుణుల పర్యవేక్షణ, సలహా లేకుండా ఈ ఆసనం చేయవద్దు. ఎందుకంటే ఈ యోగాసనాన్ని తప్పుగా చేస్తే, అది మీకు చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల ముందుగా మీ ఆరోగ్యం గురించి మీ యోగా నిపుణుడికి చెప్పండి. అతని పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆసనాన్ని ప్రారంభించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..