Bad Breath: చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలామందిని వేధించే సమస్య నోటి నుంచి దుర్వాసన రావడం. ఈ సమస్యని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అయితే నోటి నుంచి దుర్వాసన ఎవరికీ వారికీ ఎంతవరకూ తెలుస్తుందో తెలియదో కానీ.. ఎదుటివారిని మాత్రం తెగ ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. ఈ సమస్యని నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు వైద్య నిపుణులు.నోటిదుర్వాసన కొన్ని వ్యాధులను సూచిస్తుందంటున్నారు. ముఖ్యంగా దంతాలు, నాలుకపై బ్యాక్టీరియా పెరగడంవల్ల నోటి నుంచి దుర్వాసన వెలువడే అవకాశం ఉంది.
అయితే కొన్ని సార్లు ఈ సమస్యని చిన్న చిన్న చిట్కాలతో పోగొట్టుకోవచ్చు.. ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం, మౌత్ వాష్ లు ఉపయోగించడం ద్వారా కొంతమంది లో ఈ సమస్య నివారించపడుతుంది. ఇలా చేసినప్పటికీ నోటి దుర్వాసన తగ్గక పొతే మాత్రం తప్పనిసరిగా శరీరంలోని ఇతర సమస్యలకు సంకేతంగా భావించవచ్చని అంటున్నారు.
గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కూడా కొన్నిసార్లు నోటి దుర్వాసన సమస్యకు కారణమవుతాయి. డయాబెటిస్ సమస్యతో బాధ పడేవాళ్లకు నోటి నుంచి కుళ్లిపోయిన పండ్ల వాసన వస్తుంది. లివర్ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు నోటి నుంచి కుళ్లిపోయిన గుడ్ల వంటి వాసన వస్తుంది.
కొంతమంది నోటి దుర్వాసన ఇతరులకు తెలియకుండా ఉండేందుకు వక్కలు, కిళ్లీలను ఆశ్రయిస్తారు. వీటిని తరచుగా నములుతుంటారు. అయితే ఇవి.. సమస్యను మరింత తీవ్రం చేస్తాయని అంటున్నారు.
ఎక్కువ రోజులు నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దంత వైద్యులులను సంప్రదించాలి. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డాక్టర్ పరీక్షించి నోటి దుర్వాసనకు గల కారణాలను తెల్సుకుని సరైన చికిత్సను అందిస్తారు.
Also Read: ధృతరాష్ట్రుని సంతానం కుమారుడు, కుమార్తె కలిసి మొత్తం 102మంది.. వారి పేర్లు ఏమిటంటే..!
సామాన్యుల భవిష్యత్ కు భద్రత కల్పించే ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.3 వేలు..