Sirsasana Benefits: యోగా, వ్యాయామం మానసిక, శారీరక ప్రశాంతతను ఇస్తుంది. ఇక యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనా యోగ విద్య నభ్యసించ వచ్చును. స్త్రీ, పురుషులు అనే బేధం కూడా లేదు.. కనుక చిన్నచిన్న వ్యాధికారాలను యోగాసనాల ద్వారా తగ్గించుకోవచ్చు.. ఈరోజు ఆసనాల్లో రాజు వంటిది… శీర్షాసనం వేయి పద్దతి, ఉపగయోగాలు తెలుసుకుందాం..!
శీర్షాసనము యోగాలో ఒక విధమైన ఆసనము. తలక్రిందులుగా అంటే.. తలను నేలపై ఆనించి కాళ్ళను పైకెత్తి చేసే ఆసనం కాబట్టి దీనికి శీర్షాసనమని పేరు. ఆసనాలలోకెల్ల ఉత్తమమైంది కనుక ‘రాజాసనం’ అని కూడా పిలుస్తారు.
నేలపై పలుచని దూది పరుపును గాని, మెత్తని టవల్ ను గానీ నాలుగు మడతలుగా పరచి రెండు చేతులపై బరువు మోపి తల భాగాన్ని నేలపైన ఆనించాలి.
రెండు కాళ్లను కలిపి మెల్లగా పైకి ఎత్తాలి.
మోకాళ్లు, తరువాత రెండు కాళ్లు కలిపి మొల్లగా పైకి ఎత్తాలి. పిక్కలు, తొడలు, నడుము, వీపు నిటారుగా వుండాలి.
కళ్లు మూసుకొని మొదట శీరాసనం పేయాలి.
బరువు తలమీద తక్కువగాను, చేతుల మీద ఎక్కువగాను మోపాలి.
శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఎత్తుతారో అంత జాగ్రత్తగా నెమ్మదిగా తిరిగి యథా స్థితికి తేవాలి
కొద్దికాలం తరువాత మెల్లగా కాళ్ళు క్రిందికి దించాలి.
ఈ ఆసనం తర్వాత పద్మాసనంలో తప్పని సరిగా విశ్రాంతి తీసుకోవాలి.
తలలో ఉన్న పియూష గ్రంధి, పీనియల్ గ్రంధులను ఉత్తేజపరచి, మిగతా గ్రంధుల సామర్ధ్యాన్ని పెంచడం వల్ల దేహంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తలలోని జ్ఞానేంద్రియా లన్నింటికి రక్తప్రసారం తగిన మోతాదులో లభించడం వలన అవన్నీ సక్రమంగా పనిచేస్తాయి.
ఊపిరితిత్తులకు, గుండెకు రక్తప్రసారం సక్రమంగా జరుగడం వల్ల అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి.
ఊపిరితితులు, గుండె బాగా పని చేస్తాయి. తెల్ల జుటు నల్లబడుతుంది. కంటి చూపు సరిగా వుంటుంది.
స్మరణ శక్తి పెరుగుతుంది
మధుమేహం, మూల శంక, వీర్యస్థలనం తగ్గి తేజస్సు పెరుగుతుంది
గమనిక: మొదట కళ్ళు ముసుకొని శీర్షాసనం అభ్యాసం చేయాలి. కళ్ళకు రక్తప్రసారం అధికంగా ఉండటం వలన అవి ఎర్రబడటానికి అవకాశం ఉంది. కన్ను చెవి జబ్బులు, రక్తపోటు, మెడ నొప్పి, స్పాండ లైటిస్ ఉన్నవారు శీరాసనం వేయకూడదు. శిరస్సుకు గాయం తగిలిన వారు, బలహీనంగా వున్నవాళ్లు యీ ఆసనం వేయకూడదు.
ఈ శీర్షాసనం అలవాటు అయ్యేవరకు ఇతరుల సాయంతో గాని, గోడ ఆధారంతో గాని వేయవచ్చు.
Also Read::: ఆ నదిలో నీరు 24గంటలు మరుగుతూనే ఉంటుంది.. నిప్పులేకుండా వంట రెడీ