Winter Skin Care Tips: చలికాలంలో మీ చర్మం పొడిబారుతోందా.. అయితే పట్టు లాంటి చర్మం కోసం తేనెను ఇలా ఉపయోగించండి..

చలికాలంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలనుకుంటే తేనెతో చర్మాన్ని మసాజ్ చేయండి.

Winter Skin Care Tips: చలికాలంలో మీ చర్మం పొడిబారుతోందా.. అయితే పట్టు లాంటి చర్మం కోసం తేనెను ఇలా ఉపయోగించండి..
Honey For Dry Skin
Follow us

|

Updated on: Nov 10, 2022 | 7:09 AM

చలికాలం ప్రారంభమై చలిగాలులు శరీరాన్ని తాకుతున్నాయి. చల్లని వాతావరణం చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ సీజన్‌లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఈ సీజన్‌లో చర్మంలో తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఈ సీజన్లో చర్మంలో శరీరానికి అవసరమైన విటమిన్ D లేకపోవడం కూడా కారణంగా మారుతుంది. దీని ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. చలికాలంలో విటమిన్ డి లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం మొదలవుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. విటమిన్ డి అనేది కరిగే విటమిన్, ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ముఖ్యంగా సుర్యరశ్మి నుంచి వస్తుంది. శీతాకాలంలో చర్మం పొడిని తొలగించడానికి మనం తరచుగా కాస్మెటిక్ క్రీములను ఉపయోగిస్తాము. దీని ప్రభావం కొంత సమయం వరకు ఉంటుంది. ఆ తర్వాత చర్మం మళ్లీ పొడిగా మారిపోతుంది. ఈ సీజన్‌లో చర్మంపై హోం రెమెడీలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెడికల్ న్యూస్ టుడే అందించిన సమాచారం ప్రకారం, చలికాలంలో చర్మంపై తేనెను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేనెను చర్మానికి వాడటం వల్ల చర్మం పొడిబారడంతోపాటు చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. తేనె వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు, దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం.

శీతాకాలంలో చర్మానికి తేనె ఎలా ఉపయోగపడుతుంది:

తేనె ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. యాంటీ-మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్న తేనె మొటిమలు, నిర్జీవమైన, పొడి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మంపై తేనెను ఉపయోగించడం వల్ల చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. డ్రై స్కిన్‌ను తొలగిస్తుంది. తేనె చర్మంపై క్లెన్సర్‌గా పనిచేస్తుంది.

ఇది చర్మ రంధ్రాలను క్లియర్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మంలోని మృతకణాలను తొలిగిస్తుంది. చలికాలంలో చర్మం పొడిగా ఉంటుంది కాబట్టి చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి మెరుపునిస్తుంది.

చర్మంపై తేనెను ఎలా ఉపయోగించాలి:

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. పాలతో తేనెను ఉపయోగించండి. ముందుగా ఒక చెంచా తేనె తీసుకుని అందులో ఒక చెంచా పాలు కలపాలి. రెండింటినీ బాగా కలపండి. సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను ముఖంపై 15-20 నిమిషాల పాటు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం పొడిబారకుండా చేసి చర్మం నునుపుగా, ఆరోగ్యంగా మార్చుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఫ్యాషన్ న్యూస్ కోసం

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??