Kitchen Tips: పాన్ లో ఆహారం అంటుకుంటుందని ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..

|

Feb 10, 2022 | 4:08 PM

Kitchen Tips: వంట చేస్తున్న సమయంలో కొత్తవారైనా, వంట చేయడం అలవాటు ఉన్న వారైనా తరచుగా డిఫరెంట్ రేసిపీలతో విభిన్న వంటలను తయారు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల వంటల ప్రయోగాలు చేసే..

Kitchen Tips: పాన్ లో ఆహారం అంటుకుంటుందని ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..
Home Made Easy Tips
Follow us on

Kitchen Tips: వంట చేస్తున్న సమయంలో కొత్తవారైనా, వంట చేయడం అలవాటు ఉన్న వారైనా తరచుగా డిఫరెంట్ రేసిపీలతో విభిన్న వంటలను తయారు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల వంటల ప్రయోగాలు చేసే సమయంలో వివిధ రకాల పదార్ధాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇలా వంటలు చేస్తున్న సమయంలో కొన్ని సార్లు పాన్ కు ఆహార పదార్ధాలు అంటుకుని వంట చేసే వారిని ఇబ్బంది పెడతాయి. అప్పుడు ఆ పాన్ నుంచి వండిన ఆహార పదార్ధాన్ని వేరేగిన్నేలోకి తీయడం కూడా కష్టమవుతుంది. ఒకొక్కసారి అలా పాన్ లో వండిన వంటకం మాడిపోతుంది, కూడా అయితే ఈరోజు పాన్ కు అంటుకోకుండా సింపుల్ చిట్కాలతో వంట చేసుకోవచ్చు. ఈ రోజు పాన్ మనం వండే ఆహారపదార్ధం అంటుకోకుండా ఎలా వంట చేసుకోవాలి అనే చిట్కాల గురించి తెలుసుకుందాం..

1. స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్ లో వండే ఆహారం పాన్ కు అంటుకోకుండా ముందు పాన్‌ ని వేడి చేసి.. అప్పుడు దానిలో కొన్ని నీటి చుక్కలని ఎక్కువ వేడి మీద చిలకరించాలి. ఆ చుక్కలు ఆవిరి అయ్యాక స్విమ్ లో పెట్టి.. అప్పుడు వంట చేసుకోవాలి. అప్పుడు పాన్ లో చేసే వంట పాన్ కు అంటుకోదు.
2. పాన్ లో వంట చేస్తున్న సమయంలో స్టీల్ చెంచా ని ఉపయోగించడం కంటే.. చెక్క చెంచా ఉపయోగించాలి. ఒక మెటల్ లేదా నాన్-స్టిక్ పాన్ లో మెటల్ స్పూన్‌తో వండిన ఆహారపదార్ధాలను
3. పాన్ ను ముందు వేడి చేసి.. తర్వాత నూనెను వేసుకోవాలి.. నూనె కూడా వేడి ఎక్కిన తర్వాత అప్పుడు మిగిలిన ఆహారపదార్ధాలు వేసుకుని వంట చేసుకోవాలి.
4. పాన్ లో ఆహారపదార్ధాలు వండిన అనంతరం తేమ ఉన్నప్పుడు తీసుకుంటే పాన్ కు ఆహారం అంటుకోదు. ముందుగా పాన్ లో వండిన ఆహారపదార్ధం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. పాన్ ముతమీద చల్లని నీరు పోయాలి. అప్పుడు పాన్ లోని వంట పాన్ కు అంటుకోదు.
5. పాన్ లో వంట చేస్తున్న సమయంలో తక్కువ వేడి మీద ఆహారం ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన ఆహారం స్టెయిన్‌లెస్ స్టీల్‌కు అంటుకోదు. స్టెయిన్లెస్ స్టీల్, నిజానికి, ఒక అద్భుతమైన ఉష్ణ వాహకం. కనుక ఆహారం వండే సమయంలో ఎక్కువ వేడి మీద లేదా స్టవ్ హై ప్లేమ్ లో పెట్టి వంట చేయాల్సిన అవసరం లేదు.

Also Read:  ఈ నాలుగు రాశులవారు మంచి జ్ఞాపక శక్తి, తెలివితేటలు గలవారు.. అందులో మీరున్నారా తెలుసుకోండి..