Business Idea: అరటి గెల కోసి చెట్లను పడేస్తున్న అన్నదాత.. చెట్లను కూడా అమ్మితే భారీ ఆదాయం.. ఎలా అంటే..

|

Apr 03, 2023 | 5:36 PM

అరటి చెట్టును కత్తిరించిన తర్వాత.. అరటి ఆకులు, బెరడు, కాండాన్ని  ఎండలో ఎండబెడతారు. ఇలా ప్రాసెస్ చేసి అరటి నారతో బుట్టలు, బ్యాగులు, చాపలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన వస్తువులకు మార్కెట్‌లో మంచి ధర పలుకుతుంది. అంతేకాదు దీని బెరడును ఉపయోగించి సోఫాల తయారీకి ఉపయోగించే బట్టలు కూడా తయారు చేస్తారు.

Business Idea: అరటి గెల కోసి చెట్లను పడేస్తున్న అన్నదాత.. చెట్లను కూడా అమ్మితే భారీ ఆదాయం.. ఎలా అంటే..
Banana Tree Cloth
Follow us on

అరటి చెట్లు పంటని ఒక్కసారి మాత్రమే ఇస్తాయి. ఇతర పండ్ల చెట్ల మాదిరిగా.. మళ్ళీ మళ్ళీ పండ్లను ఇవ్వవు. రైతులు అరటి చెట్టు నుండి ఒక్కసారి మాత్రమే పండ్లను తీసుకోగలరు. అరటి గెల పక్వానికి వచ్చిన తర్వాత అరటి చెట్టును నరికి గెలను కోస్తారు. అనంతరం పొలం నుండి అరటి చెట్లను తొలగిస్తారు. అనంతరం.. పొలాన్ని మళ్ళీ పంటకు రెడీ చేసి.. అదే స్థలంలో అరటి మొక్కలను నాటతారు. తద్వారా రైతు మంచి దిగుబడి పొంపొందుతారు. అయితే అరటి పంటతో పండ్ల ద్వారా మాత్రమే కాదు.. అరటి చెట్టులోని ప్రతి భాగం అన్నదాతకు ఆదాయాన్నిఇస్తుందన్న సంగతి మీకు తెలుసా..! అరటి చెట్టు కత్తిరించిన తర్వాత దాని బెరడు, ఆకులు, కాండం ద్వారా మంచి ఆదాయం వస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఆజ్ తక్ నివేదిక ప్రకారం.. అరటి చెట్టును కత్తిరించిన తర్వాత.. అరటి ఆకులు, బెరడు, కాండాన్ని  ఎండలో ఎండబెడతారు. ఇలా ప్రాసెస్ చేసి అరటి నారతో బుట్టలు, బ్యాగులు, చాపలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన వస్తువులకు మార్కెట్‌లో మంచి ధర పలుకుతుంది. అంతేకాదు దీని బెరడును ఉపయోగించి సోఫాల తయారీకి ఉపయోగించే బట్టలు కూడా తయారు చేస్తారు. బీహార్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో అరటి చెట్లతో బట్టలు కూడా తయారు చేస్తున్నారు.

ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి రాయితీ  

ఇవి కూడా చదవండి

అరటి బెరడు నుంచి వస్త్రాన్ని సిద్ధం చేయడానికి..  ముందుగా మీరు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాసెసింగ్ యూనిట్‌లో అరటి కాండం నుంచి పీచును తీయాల్సి ఉంటుంది. ఈ ఫైబర్‌లను ఎండబెట్టిన తర్వాత సాస్సీని తయారు చేస్తారు. ఈ బెరడు నుంచి బ్యాగులు, టోపీలు, వస్త్రంతో సహా అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తారు. విశేషమేమిటంటే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది.

అరటి పీచుతో తయారైన ఉత్పత్తులకు మంచి ధర 

కనుక అరటి పంట వేసే అన్నదాత ఇక నుంచి అరటి చెట్టుని గెల కోసిన అనంతరం పడవేయకుండా.. చెట్టులోని ఇతర భాగాలతో ఆదాయం మార్గాన్ని సృష్టించుకోండి.. మీ గ్రామానికి సమీపంలో ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే.. దానిని అక్కడకు తీసుకెళ్లి అమ్మవచ్చు. చెత్త అనుకుని పడవేసి అరటి చెట్టుతో మంచి సంపాదన లభిస్తుంది.

వాస్తవానికి హస్తకళల వ్యాపారంలో అరటి చెట్టు నుండి తయారు చేయబడిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది.  డబ్బున్న వ్యక్తులు ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ఖాదీ మాదిరిగానే అరటి పీచుతో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర ఉంది.  అదే సమయంలో..  అరటి ఫైబర్ నుండి కాగితం కూడా తయారు చేయబడుతుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఉత్పత్తులు త్వరగా పాడవవు. కనుక అరటి చెట్టులో పనికి రాని భాగం అంటూ ఏదీ లేదు..

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..