Sit Exercise: అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదట.. రోజూ 5 నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

|

Nov 25, 2021 | 8:34 PM

Sit Exercise: నేటి తరానికి పెద్దగా తెలియని పనిష్మెంట్..  గోడ కుర్చీ.. ఇంట్లోని పెద్దవారు ఉంటే.. మా చిన్న తనంలో మేము చదువుకునే సమయంలో అల్లరి చేసినా, సరిగ్గా చదవక పోయినా..

Sit Exercise: అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదట.. రోజూ 5 నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Goda Kurchi
Follow us on

Sit Exercise: నేటి తరానికి పెద్దగా తెలియని పనిష్మెంట్..  గోడ కుర్చీ.. ఇంట్లోని పెద్దవారు ఉంటే.. మా చిన్న తనంలో మేము చదువుకునే సమయంలో అల్లరి చేసినా, సరిగ్గా చదవక పోయినా మా ఉపాధ్యాయులు మాకు పనిష్మెంట్ ఇచ్చేవారు. గోడ కుర్చీ వేయించేవారు, గుంజీలు తీయించేవారు అంటూ తమ చిన్నతనంలో స్కూల్ ముచ్చట్లను చెబుతుంటారు. అయితే ఇలా టీచర్ గోడ కుర్చీ వేయిస్తే.. అది శిక్షగా అనుకునేవారు.. కానీ అప్పటి శిక్షల్లో కూడా ఆరోగ్య రహస్యాలు దాగున్నాయని పలు పరిశోధనద్వారా తెలుస్తోంది. అవును గోడ కుర్చీ వేయడం త‌ప్పు చేస్తే ఇచ్చే ప‌నిష్మెంట్ కాదు.. అది వ్యాయామంలో ఒకటి అంటున్నారు. పిల్లలు, పెద్దలు వృద్ధులు ఎవరైనా సరే రోజుకు కేవలం ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తె.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోడ కుర్చీ వేస్తె కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ప్రస్తుత పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలా ఒత్తిడికి గురయ్యేవారు నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కనుక ఏ వయసు వారైనా ప్రశాంత వాతావరణంలో ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తే.. మాసిక ఒత్తిడి, ఆందోళల వంటి సమస్యలు దూరమవుతాయట. అంతేకాదు మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుందని చెబుతున్నారు.

శ‌రీరంలో క్యాల‌రీలు కరుగుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా ఉన్నవారు గోడ కుర్చీని రోజూ వేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. పొట్ట వద్ద ఉన్న కండరాలు దృఢంగా మారి కొవ్వు క్రమ క్రమంగా కరిగి నాజూకు పొట్ట ఏర్పడుతుంది.

వెన్ను నొప్పితో బాధ ప‌డే వారికి గోడ కుర్చీ  మంచి వ్యాయామం. రోజూ ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే వెన్నెముక నొప్పి తగ్గుతుంది. అంతేకాదు వెన్నెముక గట్టిపడుతుంది.

రోజు ఐదు నిముషాలు గోడ కుర్చీ వేసేవారు గుండె పని తీరు మెరుగుపడుతుంది. గుండె పోటు, గుండె సంబంధిత ఇతర వ్యాధుల నివారిస్తుంది.

గోడ కుర్చీ వేయడంవలన కాళ్ల‌లో ఉండే కండ‌రాలు దృఢంగా మారి పిక్క‌లు గ‌ట్టి ప‌డ‌తాయి.

ఐదు నిమిషాల గోడ కుర్చీలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. కనుక రోజూ ఎక్కువ సమయం వ్యాయామం చేయలేనివారు గోడ కుర్చీని ఆశ్రయిస్తే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Also Read:  రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం..