Pimple Marks Cure: మొటిమలు అన్నీ ఒకేలా ఉండవని మీకు తెలుసా? మొటిమల్లో వ్యత్యాసాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?. తేడాలేమైనా.. మొటిమలు ముఖారవిందాన్ని పాడు చేస్తాయి. కొన్ని మొటిమలు మచ్చలుగా ఏర్పడితే.. మరికొన్ని మొటిమలు చర్మంపై గుంటలు ఏర్పడేలా చేస్తాయి. మొటిమలు అందవికారంగా చేస్తాయి. అందుకే మొటిమలు వచ్చాయంటే చాలు హడలిపోతుంటారు. మొటిమలు రాకుండా ఉండేందుకు.. వచ్చిన మొటిమలను తొలగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల క్రీములు, ప్రయోగాలు చేస్తుంటారు. అయితే, మొటిమల వల్ల ముఖం పాడవకుండా ఉండాలంటే.. ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు.. ఈ 5 చిట్కాలను పాటిస్తే మొటిమల వలన ఏర్పడిన మచ్చలను సులభంగా తొలగించుకోవచ్చు. మరి ఆ 5 చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనే..
కొబ్బరి నూనెతో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మొటిమలతో సహా అన్ని రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్లు K, E అధికంగా ఉంటుంది. ఇవి మొటిమలను తొలగించడానికి ఉపయోగపడటమే కాకుండా.. ఆరోగ్యకరమైన చర్మ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. అందుకే.. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో ముఖం మీద మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలపై మర్ధన చేయాలి. రాత్రి అంతా అలాగే ఉంచి, ఉదయం మంచినీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ప్రతీ రోజూ ఇలా చేస్తే.. త్వరగా ఫలితం ఉంటుంది.
బేసన్/శనగ పిండి..
భారతీయ వంటశాలలలో కనిపించే అత్యంత సాధారణ పదార్ధాలలో బేసన్/శనగపిండి ఒకటి. ఇది అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారం. ఆల్కలైజింగ్ లక్షణాలు కలిగిన ఈ శనగపిండి.. మొటిమలను తొలగించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. దీనిని ఫేస్ స్క్రబ్‌లుగా కూడా ఉపయోగించవచ్చు. ఒక టీస్పూన్ శనగపిండిలో సరిపడా రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. పేస్ట్‌లా కలిపిన తరువాత.. దానిని ముఖంపై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆరెంజ్ పీల్ పౌడర్..
నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలు, మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి కారణమవుతుంది. 1 స్పూన్ నారింజ తొక్క పొడి, 1 స్పూన్ ముడి తేనె తీసుకుని మిక్స్ చేయాలి. పేస్ట్‌లా తయారు చేసుకున్న ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, ప్రభావిత ప్రాంతాలపై అప్లై చేయాలి. 10 – 15 నిమిషాల పాటు ఉంచుకుని.. ఆ తరువాత మంచినీటితో శుభ్రపరుచుకోవాలి.
కలబంద..
కలబంద.. మానవ జాతికి ప్రకృతి ఇచ్చిన వరం. ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన కలబంద.. మొటిమల మచ్చలు, మచ్చలు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. తాజా కలబంద ఆకుల నుండి వచ్చే జెల్‌ను ముఖం, మెడపై అప్లై చేయాలి. రాత్రి సమయంలో అప్లై చేసుకుని.. ఉదయం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్.. మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడే మచ్చల తొలగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. అన్ని రకాల చర్మ వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. మీరేం చేయాలంటే.. మూడు, నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్, కొబ్బరి/బాదాం నూనె మిక్స్ చేయాలి. ఆ తరువాత ఆ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. ఇది అప్లై చేసిన తరువాత ఒక రెండు గంటల పాటు అలాగే ఉండనివ్వాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు ముఖానికి పెట్టుకుని.. ఉదయం మంచినీటితో శుభ్రం చేసుకుంటే మంచిది. ప్రతీ రోజూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Also read:
Divorce Party: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న మహిళ..!