ఇయర్ ఫోన్స్ వినియోగం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఎంచక్కా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేసేందుకు ఉపయోగపడే ఇయర్ ఫోన్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని మీకు తెలుసా.? ఇక సాధారణంగా ఇతరుల ఇయర్ ఫోన్స్‌ను కూడా ఉపయోగిస్తుంటాం ఇది ఏ మాత్రం మంచితి కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇతరులు ఉపయోగించిన ఇయర్ ఫోన్స్‌ను నేరుగా ఉపయోగిస్తే వారి చెవుల్లో ఉన్న బ్యాక్టీరియా మీ చెవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో చెవి సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. చెవిలో ఉండే వాతావారణం బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది. బ్యాక్టీరియా ఎక్కువైతే చెవి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చెవుల్లో ఇన్ఫెక్షన్ పెరిగి క్రమంగా చెవుల్లో నుంచి చీము కారడం వంటి సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇతరుల ఇయర్ ఫోన్స్‌ను వాడే సమయంలో కచ్చితంగా వాటిని శుభ్రంగా తూడ్చిన తర్వాతే ఉపయోగించాలి.
అలాగే మనలో చాలా మంది ఇయర్ ఫోన్స్‌ను ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు. దీంతో దుమ్ము, ధూళి, చిన్న చిన్న పురుగులు వంటివి ఇయర్ ఫోన్స్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. వాటిని వెనకాముందు చూడకుండా చెవులో పెట్టుకుంటే చెవి సమస్యలు తప్పవని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా చెవుల్లో బ్యాక్టీరియా వృద్ధి పెరుగుతుందని చెబుతున్నారు.
అంతేకాకుండా ఇయర్ ఫోన్స్‌ను ఎక్కువసేపు వాడినా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గంటల తరబడి ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగించే వారు విపరీతమైన నొప్పి వస్తుంది. దీని విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి దీని కారణంగా నరాలు ఉబ్బుతాయి ఇది చెవి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్ఆనరు.
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే వీలైనంత వరకు ఇయర్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు. అలాగే ఇతరుల ఇయర్ ఫోన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదని చెబుతున్నారు. కొంతలో కొంత బ్రాండెండ్ కంపెనీలకు చెందిన ఇయర్ ఫోన్స్‌ను వాడితో ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇయర్ ఫోన్స్‌ను శుభ్రం చేసుకుంటుండాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లో రోజుకు 60 నిమిషాలకు మించి ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించకూడదని గుర్తుపెట్టుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..