ప్రస్తుత కాలంలో వివాహ వయసు (Marital Age) మారిపోయింది. ఒకరిపై మరొకరు ఆధారపడకూడదని, జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన యువతలో వచ్చింది. ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలన్న ఆలోచనతో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో లేట్ ఏజ్ లో పెళ్లి అవుతోంది. అయితే అలాంటి వారందరికీ పలు విషయాల్లో అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా వారి శృంగార జీవితానికి (Romantic Life) సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయి. ఏది నిజమో, ఏది అపోహానో తెలియక తికమకపడుతుంటారు. లేట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే శృంగార జీవితాన్ని ఆస్వాదించగలమా? భాగస్వామితో సవ్యంగా నడుచుకోవగలమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. అయితే వీటిపై నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు అవేంటంటే.. వైవాహిక జీవితంలో లైంగిక సంబంధం చాలా ముఖ్యం. ఇది భార్యాభర్తల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సాధారణంగా శృంగారాన్ని ప్రేరేపించే హార్మోన్లు శరీరంలో ఎప్పుడూ ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వృద్ధాప్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు. మనసులో శృంగారానికి సంబంధించిన భావనలు ఏర్పడగానే.. మెదడు అందుకు సంబంధించిన హోర్మోన్లను రిలీజ్ చేసేలా ప్రేరేపిస్తుంది. దాని వల్ల శృంగార జీవితంలో ఎలాంటి సమస్యా రాదు.
మగవాళ్లకు 80 సంవత్సరాలు వచ్చినా ఆరోగ్య సమస్యలు లేకుంటే చక్కగా శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లలోనూ సేమ్ ఇలాంటి పరిస్థితే. అయితే వయసులో ఉన్నప్పుడు కొంతమంది ప్రేమలో పడుతుంటారు. వారితో శృంగారంలో పాల్గొనాలని అనుకుంటారు. తీరా ఆ సమయం వచ్చాక అనేక సందేహాలకు గురై తికమక పడుతుంటారు. అలా కాకుండా మనసులో ఎలాంటి భయాలు లేకుండా.. ఇద్దరికీ నచ్చిన విధంగా ప్రవర్తించుకుంటే ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు రావని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే లైంగిక జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని సూచిస్తున్నారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం