Chinese Thali: హైదరాబాదీలో చైనీస్ థాలీ.. మ్యాజిక్ నూడుల్స్ నుండి పొట్లం అన్నం వరకు అన్నీ ఒక్కటే ప్లేటులో!

బిర్యానీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మన భాగ్యనగరంలో ఇప్పుడు ఒక కొత్త రకం విందు వైరల్ అవుతోంది. సాధారణంగా మనం భోజనం అంటే ఉత్తర భారత లేదా దక్షిణ భారత థాలీలను చూస్తుంటాం. కానీ, ఇప్పుడు ఇండో-చైనీస్ వంటకాలన్నీ కలిపి ఒకే భారీ ప్లేటులో వడ్డించే 'చైనీస్ థాలీ' నగరవాసులను ఊరిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని "కుచ్ భీ" (Kuch Bhi) అనే రెస్టారెంట్ ప్రారంభించిన ఈ వెరైటీ థాలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Chinese Thali: హైదరాబాదీలో చైనీస్ థాలీ.. మ్యాజిక్ నూడుల్స్ నుండి పొట్లం అన్నం వరకు అన్నీ ఒక్కటే ప్లేటులో!
Ultimate Chinese Thali In Hyderabad

Updated on: Jan 23, 2026 | 6:34 PM

ఆహార ప్రియుల కోసం నిత్యం కొత్త రుచులను పరిచయం చేసే హైదరాబాద్, ఈసారి చైనీస్ వంటకాలకు సరికొత్త రూపాన్ని ఇచ్చింది. నూడుల్స్, ఫ్రైడ్ రైస్, స్టార్టర్స్, సూప్స్.. ఇలా అన్నీ ఒకే దగ్గర దొరికితే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే అనుభూతిని ఈ చైనీస్ థాలీ ఇస్తోంది. కేవలం రుచి మాత్రమే కాదు, ఇక్కడ వడ్డించే విధానం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. గాల్లో వేలాడే ‘హ్యాంగింగ్ నూడుల్స్’, పొట్లంలా ఉండే ‘పోట్లీ నూడుల్స్’ వంటి వెరైటీలు పర్యాటకులను, ఫుడ్ బ్లాగర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

థాలీలో ఉండే స్పెషల్స్ ఇవే:

ఈ గ్రాండ్ ప్లాటర్‌లో ఘుమఘుమలాడే ఫ్రైడ్ రైస్, స్పైసీ సాస్‌లతో మెరిసిపోయే నూడుల్స్, క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్, హాట్-అండ్-సోర్ సూప్ వంటివి అందంగా అమర్చబడి ఉంటాయి. దీనికి తోడు చైనీస్ స్టైల్ పిక్సెల్స్, గ్రేవీలు, చివర్లో ఒక తియ్యటి డెజర్ట్ కూడా ఉంటుంది.

హ్యాంగింగ్ నూడుల్స్: ఒక చిన్న స్టాండ్‌పై గాల్లో వేలాడుతున్నట్లు వడ్డించే ఈ నూడుల్స్ ఈ రెస్టారెంట్ ప్రధాన ఆకర్షణ.

1000 రైస్: మూడు రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను గ్రేవీతో కలిపి ఇక్కడ వడ్డిస్తారు.

మ్యాజిక్ కొరియాండర్ నూడుల్స్: కొత్తిమీర ఫ్లేవర్‌తో ఉండే ఈ నూడుల్స్ కొత్త రుచిని అందిస్తాయి.

బడ్జెట్ ధరలోనే భారీ విందు:

తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ థాలీ ధరలను నిర్ణయించారు.

వెజ్, చికెన్ థాలీ: రూ. 495

సీఫుడ్ థాలీ: రూ. 595

పరిమాణం కూడా ఎక్కువే ఉండటంతో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి షేర్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సంప్రదాయ థాలీకి స్ట్రీట్ స్టైల్ చైనీస్ రుచులను జోడించి చేసిన ఈ ప్రయోగం సూపర్ హిట్ అయింది.