
తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మనం పదే పదే ఎదుర్కొనే ‘బద్ధకం’ అనేది కేవలం క్రమశిక్షణ లేకపోవడం వల్ల వచ్చేది కాదట. అసలు బద్ధకం ఎందుకు వస్తుంది? మన మెదడును ఎలా మభ్యపెట్టి పనులను వేగంగా పూర్తి చేయవచ్చు? మస్క్ సూచించిన ఆ ‘మోటివేషన్ హ్యాక్’ ఏంటి?
ప్రసిద్ధ కార్టూనిస్ట్ మరియు రచయిత స్కాట్ ఆడమ్స్ రూపొందించిన ఒక వీడియోను మస్క్ తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో స్కాట్ ఆడమ్స్ ఒక షాకింగ్ నిజం చెప్పారు. మనం ఏదైనా పని చేయకుండా వాయిదా వేస్తున్నామంటే దానికి కారణం మనలో క్రమశిక్షణ లేకపోవడం కాదు, మన ఆలోచనా విధానమేనని ఆయన వివరించారు. చాలామంది ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన కష్టం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్ల మెదడు ఆ పనిని భారంగా భావించి బద్ధకాన్ని సృష్టిస్తుంది.
మన శరీరంలో ‘డోపమైన్’ అనే కెమికల్ మనల్ని పనులు చేసేలా ప్రేరేపిస్తుంది. మనం ఏదైనా పని చేసినప్పుడు వచ్చే సంతోషం లేదా ప్రతిఫలం మీద దృష్టి పెట్టినప్పుడు మన మెదడులో ఈ డోపమైన్ విడుదలవుతుంది.
ఎలాన్ మస్క్ తన జీవితంలో అత్యున్నత లక్ష్యాలను పెట్టుకుంటారు. ఆయన ఏ పని చేసినా దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం లేదా ఫలితం మీదే దృష్టి పెడతారు. అందుకే ఆయనకు అలసట అనేది ఉండదు. ఈ వీడియో ద్వారా ఆయన తన ఫాలోవర్లకు చెబుతున్న సందేశం ఒక్కటే.. “మీ పనిని ఒక శిక్షలా కాకుండా, దానివల్ల వచ్చే అద్భుతమైన ఫలితంలా చూడండి.”
బద్ధకానికి కేవలం మైండ్ సెట్ మాత్రమే కాదు, తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమని నెటిజన్లు ఈ పోస్ట్‌పై స్పందిస్తున్నారు. శరీరం అలసిపోయినప్పుడు మెదడు మొరాయిస్తుందని, కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు లక్ష్యంపై స్పష్టత ఉంటే బద్ధకం దరిచేరదని మస్క్ షేర్ చేసిన ఈ వీడియో సారాంశం. బద్ధకాన్ని జయించడం అంటే మనల్ని మనం బలవంతంగా తోసుకోవడం కాదు, మన మెదడుకు పనిలోని తీపిని చూపించడం. స్కాట్ ఆడమ్స్ చెప్పిన ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే వాయిదా వేయడం అనే సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.