భారతీయ వంటలకు రుచిని అందించడంలో ప్రధాన పాత్ర పోషించేవి ఏవైనా ఉన్నాయంటే అవి ఉప్పు, కారమే. ఈ రెండు లేకపోతే ఏ ఆహారం అయినా రుచిలేనిదే అవుతుంది. ముఖ్యంగా ఉప్పు లేకుండా ఏ వంటకాన్ని అయినా ఊహించుకోవడం చాలా కష్టం.. ఎన్ని పదార్ధాలు వేసిన వంటల్లో సరిగ్గా ఉప్పు వేస్తే ఆ వంటకు వచ్చే టేస్ట్ వేరు. అందుకే వంటల్లో ఉప్పు అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అతిగా ఉప్పు వాడటం కూడా ప్రమాదమేనని, అలా తినడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. ఈ విషయం తెలియక చాలా మంది ఉప్పును అతిగా తింటారని అంటున్నారు. మరి అతిగా ఉప్పు వాడటం వలన కలిగే అనర్ధాలు ఏమిటో.. నిపుణుల హెచ్చరికలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతంది. ఇలా సోడియం స్థాయి ఎక్కువగా ఉంటే.. రాత్రిపూట సరిగా నిద్రపట్టదు. తరచు మూత్రం వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా మహిళలు, వయస్సు పైబడినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఉప్పు ఎక్కువ తిన్నప్పుడు శరీర అవయావలలోని కణాలకు శక్తి సరఫరా తక్కువగా ఉంటుంది.
ఆహారం ద్వారా వెళ్లే ఉప్పులోని సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. దీంతో ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది.
ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్తపోటు, గుండె సమస్యలు, పక్షవాతం వచ్చే ప్రమాదం అధికమవుతుంది.