Foods for Hemoglobin: ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!

|

May 18, 2024 | 1:02 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. వాటిని సరిగ్గా తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్రటి రక్త కణాల్లో ఉండే ఒక ప్రోటీన్. ఇది బాడీకి ఆక్సిజన్‌ అందించడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. రక్త హీనత సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల చర్మం నలుపుగా మారడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..

Foods for Hemoglobin: ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
Foods for Hemoglobin
Follow us on

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. వాటిని సరిగ్గా తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్రటి రక్త కణాల్లో ఉండే ఒక ప్రోటీన్. ఇది బాడీకి ఆక్సిజన్‌ అందించడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. రక్త హీనత సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల చర్మం నలుపుగా మారడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. గుండె సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గకుండా చూసుకోవాలి. పురుషులకు హిమోగ్లోబిన్ లెవల్స్ 13.5 నుంచి 17.5 గ్రాములు/డెసిలీటర్ వరకు ఉంటుంది. మహిళలకు 12 నుంచి 15.5 గ్రాములు/డెసిలీటర్ వరకు ఉంటుంది. ఈ లెవల్స్ అనేవి తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలకు దారి తీయవచ్చు. మరి హిమోగ్లోబిన్ అధికంగా లభించే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హిమోగ్లోబిన్ అధికంగా లభించే ఆహారాలు:

* ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. రెడ్ మీట్, చేపలు, గుడ్లు, పౌల్ట్రీ, పప్పు ధాన్యాలు, ఆకు కూరలు వంటివి తీసుకోవాలి. అదే విధంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకోవడం మంచిది.

* విటమిన్ సితో కూడిన ఆహారాలు తినడం వల్ల కూడా హిమోగ్లోబిన్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. విటమిన్ సి అనేది శరీరం ఐరన్‌ను గ్రహించడంలో హెల్ప్ చేస్తుంది. నిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయ, నారింజ, యాపిల్, బెర్రీ జాతికి చెందిన పండ్లు, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటివి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఇనుము శోషణ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

* రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా అనేది పెరుగుతుంది. దీని వల్ల ఇది హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగేందుకు వ్యాయామం హెల్ప్ చేస్తుంది.

* అదే విధంగా కాఫీ, టీలు అనేవి పరిమితంగా తీసుకోవాలి. ఈ పానీయాల వల్ల ఐరన్ లోపానికి దారి తీస్తుంది. దీని వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతాయి. వీటికి బదులు హెల్త్ పానీయాలు, హెర్బల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..